జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్
బంగారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తుంది. నగరవాసుల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనండి.. బంగారం, నగదు గెలుచుకోండి అని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
పారిశుధ్య నిర్వహణలో పాల్గొనే కార్మికులు, బాధ్యతాయుతంగా వ్యవహరించే పౌరులకు ఈ నజరానాలు అందించాలని నిర్ణయించింది.
తడి, పొడి చెత్తను వేరుగా సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, తడి, పొడి చెత్తను ఇళ్లలో వేరు చేసే కార్మికులకు అందించే నగరవాసులకు
ఈ బహుమతులు అందించనున్నారు.
