భారీ వర్షం కురిసే ఛాన్స్.. అవసరమైతేనే బయటకు రండి : హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ అలర్ట్
హైదరాబాద్ లో భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ కీలక సూచన చేసింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం వున్నందున నగర వాసులు అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.
తెలుగు రాష్ట్రాలు (telugu states) భారీ వర్షాలు తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో (hyderabad) ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ (ghmc) కీలక హెచ్చరిక చేసింది. మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని .. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్ బృందాలను జీహెచ్‌ఎంసీ మోహరించింది.
కాగా..ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్, నెరేడ్‌మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ..దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండీ పేర్కొంది.
ALso REad:Weather update : రాబోయే మూడు రోజుల్లో.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
మరోవైపు.. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా.
జులై 1న పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జూన్ 30న ఉత్తరాఖండ్ మీదుగా, జూన్ 28న తూర్పు రాజస్థాన్, జూన్ 28, జూలై 1 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌పై, జూన్ 29, 30 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాబోయే రెండు రోజులలో ఉత్తరాఖండ్‌లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 29, 30 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, జూన్ 30 వరకు తదుపరి 3 రోజులలో తూర్పు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశంఉంది.