Asianet News TeluguAsianet News Telugu

Weather update : రాబోయే మూడు రోజుల్లో.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ సహా రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

IMD predicts very heavy rainfall in these states over next few days, showers in Delhi likely on June 29
Author
Hyderabad, First Published Jun 28, 2022, 9:10 AM IST

న్యూఢిల్లీ : అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా.

జులై 1న పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. జూన్ 30న ఉత్తరాఖండ్ మీదుగా, జూన్ 28న తూర్పు రాజస్థాన్, జూన్ 28, జూలై 1 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌పై, జూన్ 29, 30 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాబోయే రెండు రోజులలో ఉత్తరాఖండ్‌లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 29, 30 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, జూన్ 30 వరకు తదుపరి 3 రోజులలో తూర్పు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశంఉంది.

రాబోయే కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జూన్ 29 వరకు ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌పై కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కోస్తా కర్ణాటకలో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు IMD జూన్ 27న ట్వీట్ చేసింది. రాబోయే 5 రోజుల్లో ఈశాన్య భారతదేశం, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ వర్షపాతం, ఉరుములు/మెరుపులతో కూడిన విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది."

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ హెచ్చరిక...

మరోవైపు రాజధాని ఢిల్లీలో సోమవారం ఉత్కంఠ నెలకొంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, మంగళవారం మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ స్థిరపడే అవకాశం ఉంది. జూన్ 29 నుంచి ఢిల్లీలో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. దేశ రాజధానిలో రుతుపవనాల ఆగమనాన్ని జూన్ 30 లేదా జూలై 1న ప్రకటించే అవకాశం ఉంది.

వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుండి, ఢిల్లీ సాధారణ వర్షపాతం 59.5 మిల్లీమీటర్లకు భిన్నంగా కేవలం 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. ఈ వర్షాలు కూా జూన్ 16- జూన్ 20 మధ్య కురిసినవే. జూలై మొదటి వారంలో వచ్చే రుతుపవనాలు సమృద్ధిగా కురిసి.. ఈ వర్షపు లోటును భర్తీ చేస్తాయని, వేడి నుండి ఉపశమనం లభిస్తుందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ (వాతావరణ మార్పులు, వాతావరణ శాస్త్రం) మహేష్ పలావత్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios