Asianet News TeluguAsianet News Telugu

బావిలో మృతదేహాల మిస్టరీ: ఓ వ్యక్తితో బుస్రా అఫైర్, ప్రియుడిపై ఆరా

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో లభించిన మృతదేహాల మి,స్టరీ ఇంకా వీడలేదు. మక్సూద్ కూతురు బుస్రా ఆలం ప్రియుడిని పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.

Geesugonda dead bodies mystery: Twists in case
Author
Warangal, First Published May 23, 2020, 8:33 AM IST

వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తేలిన 9 మంది శవాల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 9 మంది మృతదేహాలపై ఏ విధమైన గాయాలు లేవు. దీంతో వాళ్లు ఎలా మరణించారనేది మిస్టరీగా మారింది. బుధవారం రాత్రి సంఘటన జరిగిన 8-9 గంటల మధ్య ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మక్సూద్ కుటుంబం వరంగల్ లోని కరీమాబాద్ లో ఉంటూ వచ్చింది. మక్సూద్ గొర్రెకుంటలోని గోనెసంచీల ఫ్యాక్టరీలో పనిచేస్తూ వస్తున్నాడు. అయితే, లాక్ డౌన్ కారణంగా కరీమాబాద్ నుంచి రావడం కష్టంగా ఉందని మక్సూద్ చెప్పడంతో ఫ్యాక్టరీలోనే ఉండాలని యజమాని సంతోష్ చెప్పాడు. దీంతో వారు అక్కడికి మారారు. అదే ఆవరణలో శ్యామ్, శ్రీరామ్ అనే బీహార్ యువకులు ఉండే వారు. 

Also Read: గీసుకొండ బావిలో 9 శవాల మిస్టరీ: అక్రమ సంబంధమే కారణమా?

నివాసం ఉంటున్న షెడ్డులో బుధవారం నుంచి కనిపించడం లేదు. గురువారం మధ్యాహ్నం యజమాని సంతోష్ కు శవాలు కనిపించాయి. ఈ విషయాన్ని సంతోష్ పోలీసులకు చెప్పాడు. ముందు నాలుగు శవాలు తీశారు. అయితే, ఆ తర్వాత మరో ఐదు శవాలు బయటపడ్డాయి. ఒకటి తర్వాత మరొకటి శవాలు బావిలో బయటపడుతూ వచ్చాయి. 

నాలుగు శవాలు బయటపడిన తర్వాత బీహార్ యువకులు ఏమయ్యారనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. వారి గదులు వెతికితే పర్సులు, ఆధార్ కార్డులు కనిపించాయి. పారిపోయే వాళ్లయితే వాటిని ఎందుకు వదిలిపెడుతారని పోలీసులు అనుమానించారు. మక్సూద్ కుమారులు కూడా కనిపించలేదు. దాంతో వారేమయ్యారని దృష్టి పెట్టారు. అయితే, ఆ తర్వాత మరో ఐదు శవాలు బయటపడ్డాయి.

శ్యామ్, శ్రీరామ్ అనే బీహారీ యువకుల శవాలతో పాటు మక్సూద్ ఇద్దరు కుమారుల శవాలు కూడా బయటపడ్డాయి. దానితో పాటు మక్సూద్ మిత్రుడు షకీల్ శవం కూడా బయటపడింది. దీంతో వీరందరినీ ఎవరో చంపారనే అనుమానంతో పోలీసులు కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బుధవారం రాత్రి గంట వ్యవధిలో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సాయంత్రం 6 గంటలకు నిషా, కృషు, బుస్రా ఆలం, సోయబ్, శ్రీరామ్, శ్యామ్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. సాయంత్రం 7 గంటలకు మక్సూద్ తన మిత్రుడు షకీల్ ను పిలిచాడు. ఆ తర్వాత 7.45 గంటలకు మక్సూద్ తన యజమాని సంతోష్ తో మాట్లాడాడు. సంతోష్ ను పోలీసులు విచారించారు.గురువారంనాడు కొన్ని శవాలు కనిపించడంతో యజమాని సంతోష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 

మక్సూద్ కూతురు బుస్రాకు వరంగల్ నగరంలోని ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బుస్రాపై బీహార్ యువకులు శ్యామ్, శ్రీరామ్ కన్నేయడం అతనికి నచ్చలేదా, అందుకే అతను అందరినీ చంపేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని కూడా పోలీసులు విచారించారు. అంత మందిని ఒక్కడే చంపి బావిలో పడేయడం సాధ్యం కాదు కాబట్టి మరింత మంది పాత్ర కూడా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. దీంతో ఆ వ్యక్తి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు 

బుస్రా కుమారుడి జన్మదిన వేడుకకు బుస్రా ప్రియుడు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఆహారంలో విషం కలిపి అందరినీ చంపేసి ఉంటారని అంటున్నారు. పరువు హత్య కూడా అయి ఉండవచ్చునని అంటున్నారు నగరంలోని వ్యక్తితో బుస్రా సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేని కుటుంబంలో ఒకరు ఆ చర్యకు దిగి ఉండవచ్చునని అంటున్నారు. 

Geesugonda dead bodies mystery: Twists in case

ముంబైలోని భర్తకు విడాకులు ఇచ్చి బుస్రా ఇక్కడికి వచ్చింది. బుస్రా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేని మాజీ భర్త ఈ చర్యకు దిగి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. 

షకీల్ మృతదేహానికి ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. ఆయన స్థానికుడు కావడంతో కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారు. దాంతో పోస్టుమార్టం పూర్తయింది. మక్సూద్ కుటుంబ సభ్యులంతా పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. దాంతో వారి కుటుంబ సభ్యులు తుఫాను కారణంగా రాలేని స్థితిలో ఉన్నారు. దీంతో పోస్టుమార్టం ఆగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios