వరంగల్: మక్సూద్ కూతురు బుస్రుఖతర్ తో ఇద్దరు బీహారీ యువకులకు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె విషయంలోనే బీహారీలకు, స్థానిక యువకులకు మధ్య గొడవ జరిగినట్లు చెబుతున్నారు. దాంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. బీహారీల కాల్ డేటాను పోలీసులను పరిశీలిస్తున్నారు. 

మూడేళ్ల క్రితం మక్సూద్ కూతురు బుస్రు ఖతర్ కు ముంబైకి చెందిన ఓ యువకుడితో వివాహమైంది. అయితే, కొన్నాళ్ల క్రితం ఆమె భర్తతో విడాకులు తీసుకుని తండ్రి మక్సూద్ వద్దకు వచ్చి ఇక్కడే ఉంటోంది. కొన్నాళ్ల క్రితం ఇద్దరు బీహారీ యువకులు మక్సూద్ ఇంటి కింద అద్దెకు దిగారు. 

Also Read: గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల ఘటనపై 9 టీములతో దర్యాప్తు: సీపీ రవీందర్

శ్రీరామ్, శ్యామ్, మక్సూద్ ఒకే చోట పనిచేస్తారు. ఈ నేపథ్యంలో బీహారీ యువకులతో మక్సూద్ కూతురుకు ఉన్న సంబంధాలపై పోలీసుుల ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తునకు పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. మక్సూద్ ఇంట్లోని ఆహార పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. గత రెండు రోజులుగా మక్సూద్ ఎవరితో మాట్లాడారనే విషయంపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.  

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో  9 మృతదేహాలు తేలిన విషయం తెలిసిందే తొలుత సామూహిక ఆత్మహత్యలుగా పోలీసులు భావించారు. కానీ, హత్యలు కూడా అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆహారంలో విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అక్రమ సంబంధమే ఈ మరణాలకు కారమై ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. ఆర్థిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలకు ఘర్షణ కారణమా, వివాహేతర సంబంధం కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. 

బావిలో తేలిన 9 మృతదేహాల్లో ఆరు ఒకే కుటుంబానికి చెందినవిగా భావిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన మక్సూద్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినవారని చెబుతున్నారు. పోలీసులు మక్సూద్ ఇద్దరు కుమారుల కోసం, బీహార్ కు చెందిన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

తాజా సమాచారం ప్రకారం... పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను మక్సూద్ కుటుంబ సభ్యుడని సమాచారం. మృతుల్లో మక్సూద్ తో పాటు అతని మూడేళ్ల మనవడు కూడా ఉన్నాడు. 

Also Read: హత్యలా, ఆత్మహత్యనా: వరంగల్‌లో బావిలో శవాలుగా తేలిన తొమ్మిది మంది వలస కూలీలు

మూడేళ్ల బాలుడి పేరు తెలియడం లేదు. మిగిలినవారిని మక్సూద్ (55), నిషా (48), బష్ర ఖతూర్ (22), షాబాద్ ఆలం (21), శ్రీరాం (21), షకీల్ ()30), సోహెల్ ఆలం (18), శ్యామ్ లుగా గుర్తించారు. షకీల్ ను వరంగల్ జిల్లావాసిగా భావిస్తున్నారు. మక్సూద్ కు ఇద్దరు కుమారులున్నారు. 

పారిపోయిన బీహార్ యువకులు ఎక్కడున్నారనే విషయాన్ని పోలీసు పరిశీలిస్తున్నారు. హత్య చేసి అందరినీ కలిపి బావిలో పడేశారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. .