తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. దాదాపు కోటిన్నర విలువచేసే 400 కిలోల గంజాయిని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ :గంజాయి స్మగ్లింగ్ కోసమే డిసిఎంను రీడిజైన్ చేయించిందో కిలాడీ ముఠా. ఈ వాహనంలో పోలీసుల కళ్లుగప్పి ఒకటి, రెండు కిలోలు కాదు వందల కిలోల గంజాయిని రాష్ట్రాల బార్డర్లు దాటిస్తోంది. ఇలా అతితెలివితో కోట్ల రూపాయల గంజాయి దందా చేస్తున్న కిలాడీ ముుఠాను తెలంగాణ పోలీసుల పట్టుకున్నారు. ఈ గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ కు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ డిఎస్ చౌహాన్ వెల్లడించారు.
తెలంగాణకు చెందిన భానోతు వీరన్న, పంజా సూరయ్య, శంకర్ నాయక్, ఏపీకి చెందిన శ్రీశైలంలతో పాటు మరో ముగ్గురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు వీరు గంజాయి స్మగ్లింగ్ బాట పట్టారు. అయితే సాధారణ స్మగ్లర్లలా కాకుండా కాస్త తెలివిగా ఆలోచించి గంజాయిని గుట్టుగా సరఫరా చేసేందుకు ఓ డిసిఎంను రీడిజైన్ చేయించారు.ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా నుండి గంజాయిని కొనుగోలు చేసి ఈ డిసిఎం వాహనంలోనే తెలంగాణ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేసేవారు.
తాజాగా దాదాపు కోటిన్నర రూపాయల విలువైన 400కిలోల గంజాయిని ఏపీలో లోడ్ చేసుకుని తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలించే ప్రయత్నించారు. ఇలా గంజాయిని తరలిస్తున్న డిసిఎంలో ముందు ఓ కారును పోనిస్తూ పోలీసుల తనిఖీలు ఏమయినా వున్నాయేమో చూసుకుంటూ వెళుతున్నారు. గంజాయి వాహనంతో ఏపీ నుండి తెలంగాణలోకి ఈజీగా ఎంటర్ అయ్యారు.
Read More హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ హల్ చల్.. బాలుడిని బట్టలు విప్పించి, బెల్టుతో కొడుతూ చిత్రహింసలు..
అయితే ఈ గంజాయి స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో హైదరాబాద్ శివారులో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసారు. చౌటుప్పల్ సమీపంలో గంజాయిని తరలిస్తున్న డిసిఎంతో పాటు ముందున్న కారును కూడా పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు. రహస్యంగా తరలిస్తున్న 400కిలోల గంజాయితో పాటు రీడిజైన్ చేసిన డిసిఎం, నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్లను రిమాండ్ కు తరలించినట్లు రాచకొండ సిపి వెళ్లడించారు. పరారీలో వున్న ముగ్గురు ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఎంత తెలివిగా తప్పుపనిచేసినా ఏదో ఒకరోజు పోలీసులకు చిక్కక తప్పదని ఈ గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ తో మరోసాని నిర్దారణ అయ్యింది.
