కిరాణా కొట్లో కూర్చున్న ఓ బాలుడిని బలవంతంగా లాక్కెళ్లిందో గంజాయి గ్యాంగ్. బట్టలు విప్పించి, కొడుతూ చిత్రహింసలకు గురిచేసింది.
హైదరాబాద్ : గంజాయి గ్యాంగ్ మరోసారి హైదరాబాదులో హల్చల్ చేసింది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో మైనర్ బాలుడు మీద విచక్షణరహితంగా వేధింపులకు పాల్పడింది. గంజాయి మత్తులో ఓ బాలుడిని బలవంతంగా ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురిచేసింది. కిరాణా దుకాణంలో కూర్చున్న బాలుడిని బలవంతంగా ఎత్తుకెళ్లిన గంజాయి గ్యాంగ్ సమీపంలోని గుట్టల వద్దకి తీసుకుపోయారు. గంజాయి కొనుక్కోవడానికి తమకు డబ్బులు ఇవ్వాలని బాలుడిని అడుగుతూ.. ఆ బాలుడి బట్టలు విప్పి, బెల్టుతో.. కర్రలతో తీవ్రంగా కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు.
వారి బారి నుండి ఎలాగో తప్పించుకున్న ఆ బాలుడు చివరికి ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వివరించాడు. బాలుడి ఒంటిమీద గాయాలు చూసిన కుటుంబ సభ్యులు.. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత బారెడు బాలుడు చెప్పిన విషయం మీద మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులుగా మహమ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్ అనే వ్యక్తులతో పాటు మరో ఐదుగురి మీద వారు ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ లో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి, వ్యక్తి మృతి..
బాలుడు మీద దాడి చేయడమే కాకుండా.. నీకు దిక్కున చోట చెప్పుకొని మాకు ఏం కాదు ఇప్పటికే ఇద్దరిని హత్య చేశామని గ్యాంగ్ సభ్యులు బాలుడిని బెదిరించినట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రులు, బాలుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మైలార్ దేవులపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే గతనెలలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గంజాయి మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడిలో ఓ చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. గంజాయి తీసుకున్న మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని అయోమయంలో ఓ యువకుడు.. తనతో ఎలాంటి సంబంధం లేని ఓ చిన్నారి గొంతు కోశాడు. గురువారం నాడు ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. కావలిలోని వెంగళరావు నగర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు పురపాలక పాఠశాలలో ఆ చిన్నారి రెండో తరగతి చదువుకుంటుంది. తన పేరు చోడహవ్యశ్రీప్రియ(8).
ఆ రోజు సాయంత్రం హవ్యశ్రీ స్కూల్ నుంచి రోజులాగే ఇంటికి వస్తోంది. అదే ప్రాంతంలో నిందితుడు షేక్ ఖాదర్బాషా ఉంటారు. అతను గంజాయి వ్యసనానికి బానిసయ్యాడు. ఆరోజు కూడా గంజాయి మత్తులో ఉన్నాడు. అదే సమయంలో బాలిక స్కూల్ నుంచి వస్తూ కనిపించింది. గంజాయి మత్తులో బాలికపై బ్లేడ్ తో దాడి చేశాడు. గొంతు మీద కోయడంతో కొంత భాగం తెగింది. అతడి నుంచి తప్పించుకున్న బాలిక పరుగు పరుగున ఇంటికి చేరుకుంది. బాలిక వెంటే పరుగులు పెడుతూ వచ్చిన యువకుడు.. వారి ఇంటికి వచ్చి.. బాలిక గొంతు కోసిందని తానేనని చెప్పాడు.
బాలిక ఇంటి బయట కాసేపు హల్చల్ చేశాడు. దీంతో స్థానికులు కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. చివరికి చిన్నారి తల్లిదండ్రులు ఎలాగో బాలికతో ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకోగలిగారు. అక్కడ బాలికకు చికిత్స అందించారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. హవ్యశ్రీపై దాడి చేసిన ఖాదర్బాషాను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అతని తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా కావలి సిఐ కే శ్రీనివాస్ తెలిపారు.
