బర్త్‌ డే పార్టీ అని నమ్మి వెళితే.. బాలికపై గ్యాంగ్‌రేప్

gang rape on minor girl at nizamabad
Highlights

బర్త్‌ డే పార్టీ అని నమ్మి వెళితే.. బాలికపై గ్యాంగ్‌రేప్

రోజూ తనతో మాట్లాడే పొరుగింటి అబ్బాయి బర్త్ డే పార్టీకి వెళదామని చెబితే.. నమ్మి అతని వెంట వెళ్లిన ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.. నిజామాబాద్ కోటగల్లీ ప్రాంతానికి నివసించే మైనర్ బాలిక, తన పక్కింటి కుర్రాడితో తెలిసినవాడు కదా అని కాస్తం చనువుగా ఉండేది. దీనిని అలుసుగా తీసుకున్న ఆ కుర్రాడు.. ఈ నెల 25న బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు.. అక్కడి ఆగకుండదా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తున్నాడు..

ఇప్పుడే కాదు.. ఆరు నెలల కిందట బర్త్‌డే పార్టీకి వెళదామని బాలికను వెంట తీసుకెళ్లి.. నాగారంలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై పోలీసులకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.. నిందితులు ముగ్గురిపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
 

loader