Asianet News TeluguAsianet News Telugu

నిమజ్జనానికి తరలిస్తుండగా కూలిన గణేష్ విగ్రహం.. ఎక్కడంటే...

వర్షాలు వినాయకుడిని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాల వల్ల నానిపోయిన విగ్రహం.. నిమజ్జనానికి తరలిస్తుండగా కూలిపోయింది.

Ganesh idol fell down while being taken for immersion in hyderabad
Author
First Published Sep 9, 2022, 11:38 AM IST

హైదరాబాద్ : హైదరాబాదులో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వర్షానికి తడిసి.. నిమజ్జనానికి వెళ్తున్న గణేష్ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటన హిమాయత్ నగర్ లో జరిగింది. కర్మన్ ఘాట్ లోని టీకేఆర్ కాలేజీ వద్ద నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఈరోజు నిమజ్జనానికి వెళుతుండగా హిమాయత్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద విగ్రహం కూలిపోయింది. 

కాగా, ఈసారి వినాయక విగ్రహాలకి వర్షం పెద్ద ఆటంకంగా మారింది.  జనాల్లో పర్యావరణ స్పృహ పెరిగి.. మట్టి విగ్రహాల వైపు  మొగ్గు చూపుతున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని..  ఎక్కువ నాణ్యత లేకుండా మట్టి విగ్రహాలు తయారు చేస్తుండడం.. దీనికి తోడు  వర్షాల వల్ల  విగ్రహాలు చిన్నా,పెద్దా తేడా లేకుండా.. ఇలా విచ్చుకుపోతున్న ఘటనలు ఈసారి అనేక మండలాల్లో  కనిపించింది. దీనివల్ల  2,3 రోజుకే విగ్రహాలు నిమజ్జనానికి తరలించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ: రూ. 24.60 లక్షలకు దక్కించుకున్న లక్ష్మారెడ్డి

ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి గణేష్ నిమజ్జనోత్సవం కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటలలోపే అనేక విగ్రహాలు నిమజ్జనం జరిగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కూడా 11గం.లవరకే పూర్తవ్వడం విశేషం. రికార్డు స్థాయిలో ఈ లడ్డూ 24 లక్షలకు అమ్ముడుపోయింది. ఇక ఖైరతాబాద్ గణేషుడు శోభాయాత్ర కూడా మొదలవ్వనుంది. 

కాగా, గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది.  శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తున్నాం.  చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి  దాదాపు రెండు గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుంది.  తిరిగి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల నుంచి మెట్రో సేవలు  యధావిధిగా నడుస్తాయి. ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. 

ఇక, హైదరాబాదులో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం జిహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్బండ్పై జిహెచ్ఎంసి అధికారులు అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేశారు. మట్టి వినాయక విగ్రహాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ నిమజ్జనం చేస్తారు. ట్యాంక్బండ్ పై 15, ఎన్టీఆర్ మార్కులు తొమ్మిది, పివి మార్గంలో 8 క్రేన్ లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 354 కిలోమీటర్ల మేర గణేష్ విగ్రహాల శోభ యాత్ర సాగనుంది. ట్యాంక్ బండ్ తో పాటు 74 ప్రాంతాల్లో  జిహెచ్ఎంసి బేబీ పాండ్స్ ను కూడా ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సౌత్ జోన్ లో సుమారు 1700 వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 2500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.  గణేష్ విగ్రహాల నిమజ్జనం 10వేల మంది జిహెచ్ఎంసి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనంలో కార్యక్రమ పర్యవేక్షణకు 168 మంది అధికారులను నియమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios