ఇంతకీ ఆ విప్లవజ్వాలకు, ప్రజా పోరాటయోధుడికి, తెలంగాణ పాటగాడికి ఏమైంది.

ప్రజా యుద్ద నౌక దారి తప్పుతున్నట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఆ నౌక విప్లవ పంథాలో సాగితే ఇప్పుడు గుడిగోపురాల చుట్టూ తిరుగుతోంది.

ఇన్నాళ్లు ఓటు వేయొద్దని నినదించిన గొంతే ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వేయాలని అడుగుతానంటోంది.

ఇంతకీ ఆ విప్లవజ్వాలకు, ప్రజా పోరాటయోధుడికి, తెలంగాణ పాటగాడికి ఏమైంది.

సడెన్ గా ఎర్రజెండాను వదిలి కషాయ జెండా పట్టుకోవడంతో ఏదైనా తేడా చేసిందా...

ఓ సభలో పార్టీ పెడతానంటాడు.. సామాజిక తెలంగాణ కోసం సరికొత్త సైన్యాన్ని తయారు చేస్తానంటాడు. భావసారూప్యం ఉన్న ప్రజాసంఘాలతో కలిసి వెళుతానంటాడు.

మరో చోట కచ్చితంగా పార్టీ పెడతానంటాడు. దళిత, మైనారిటీ బలహీనవర్గాల గొంతునై రాజ్యాధికారం దిశగా సాగుతానంటాడు.

ఇంకో చోట జనసేన జెండా పట్టుకొని పోతానంటాడు. పవన్న పిలుస్తున్నాడంటాడు. పవర్ స్టార్ సామాజిక సృహ, ఆయనకు ఉన్న కమిట్ మెంట్ తనను ఆకర్షించాయంటాడు.

అచ్చంగా అపరిచితుడిలా మారిపోయిన గద్దరన్న అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన అభిమానులకే తెలియడం లేదు. కనీసం ఆయనకైనా తెలుస్తుందా అనేది అసలు ప్రశ్న.

పేదోడి బాధలను ప్రతిఒక్కరికి అర్థమయ్యేలా పాటకట్టే గద్దరన్న మాట వరకు వచ్చేసరికి మేధావులకు కూడా అర్థంకాకుండా ఎందుకు మాట్లాడుతున్నట్లు...?