Asianet News TeluguAsianet News Telugu

Free Current: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్: మంత్రి వెంకట్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు తీపి కబురు. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ అందుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. 
 

from next month free current upto 200 units says minister komatireddy venkatreddy kms
Author
First Published Jan 23, 2024, 3:29 PM IST | Last Updated Jan 23, 2024, 3:29 PM IST

మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ అందుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని ఫైర్ అయ్యారు. ఖజానాను గుల్ల చేసిందని అన్నారు. అందుకే హమీల అమలులో కాస్త జాప్యం ఏర్పడుతున్నదని వివరించారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ హామీలపై నేడు సమీక్ష నిర్వహించినట్టు మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందుగానే చెప్పినట్టు వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోబోదని అన్నారు. ఇక గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అని పేర్కొన్నారు.

Also Read: Barrelakka: ఇలాంటి పనులు చేయకు.. వారితో స్నేహమంటే పాములతో స్నేహమే.. బర్రెలక్కపై ట్రోల్స్

ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం సహా రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేస్తామని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios