Asianet News TeluguAsianet News Telugu

Barrelakka: ఇలాంటి పనులు చేయకు.. వారితో స్నేహమంటే పాములతో స్నేహమే.. బర్రెలక్కపై ట్రోల్స్

కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క సోషల్ మీడియాతోనే స్వల్ప కాలంలో తెగ వైరల్ అయ్యారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఆమె ఓ స్వామిజీని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో పెట్టింది.
 

barrelakka alias karne shirisha promotes swamyji in a viral video, gets trolled kms
Author
First Published Jan 23, 2024, 3:08 PM IST

Barrelakka: కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విశేష ఆదరణ సంపాదించుకున్న యువతి. నిరుద్యోగుల తరఫున గళం విప్పుతున్నానని, నిరుద్యోగుల తరఫున ఎన్నికల్లో కొట్లాడుతున్నానని చెప్పిన ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు లభించింది. కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలైంది. గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానని తాజాగా ఆమె ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించింది. ఇంతలోనే ఆమె పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు బర్రెలక్క చేసిన మిస్టేక్ ఏమిటీ?

బర్రెలక్క ఓ వీడియో తీసింది. అయితే, ఆ వీడియోలో ఓ స్వామిజీ గురించి చెప్పుకుంటూ వచ్చింది. ఆ స్వామిజీని వీడియోలో ప్రమోట్ చేసింది. ఆ స్వామిజీ నెంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడుతున్నానని పేర్కొంది. పోలేరమ్మ దివ్య ఆశీస్సులతో ఆ జ్యోతిష్కుడు సమస్యలను పరిష్కరిస్తాడని వివరించింది. తాను చాన్నాళ్ల నుంచి ఆ స్వామి వద్ద నుంచి సలహాలు తీసుకుంటున్నానని చెప్పింది. చాలా మంది ఆయనకు ఫోన్ చేసి తన నెంబర్ అడుగుతున్నారని, కానీ, తన నెంబర్ ఆయన వద్ద లేదని పేర్కొంది. కాబట్టి, సమయం వృథా చేసుకోవద్దని, ఆ స్వామిజీ సమయం కూడా వృథా చేయరాదని, ఆయన చాలా బిజీగా ఉంటారని తెలిపింది.

Also Read : Ayodhya: దేశమంతా రామస్మరణ.. ప్రాణ ప్రతిష్ట ముహూర్తంలో డెలివరీలు.. రామ, సీతల పేర్లు

దీంతో ఈ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేశారు. బర్రెలక్కకు పిచ్చెక్కిందా? నీలాంటివాళ్లు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది.. అంటూ నెటిజన్లు ఆగ్రహించారు. ఈ చాదస్తం మంచిది కాదని, మానుకోవాలని సూచనలు చేశారు. ఇలాంటి స్వాములతో స్నేహం అంటే.. పాములతో స్నేహమేనని పేర్కొన్నారు. మరికొందరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచిన వారిని టార్గెట్ చేసుకుంటూ కామెంట్ చేశారు. ఇంకొందరు.. బర్రెలక్క ఇక బర్రెలు కాచుకోవడమే బెటర్ అని ఫైర్ అయ్యారు. బర్రెలైనా కాచుకో గానీ.. ఇలాంటివి ప్రమోట్ చేయకు అంటూ మరికొందరు ఆగ్రహించారు. చదువుకున్న విజ్ఞత కలిగిన అమ్మాయివి.. ఇలాంటి యాడ్స్ చేయడం మానుకోవాలని, సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని, మంత్ర తంత్రాలతో ఏమీ కాదని ఇంకొందరు సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios