Top Stories: మహిళలకు బస్సు ఫ్రీ, కేసీఆర్ ఆపరేషన్ సక్సెస్, ఉద్యమ కేసులు రద్దు!, ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ రోజు మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి తెస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్‌కు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో తుంటి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. 2009 నుంచి 2014 జూన్ వరకు మలిదశ ఉద్యమలో పాల్గొన్న వారిపై నమోదైన ఉద్యమ కేసులను ఎత్తేయాలని డీజీపీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Top Stories: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మీ హామీ ఒకటి. ఈ గ్యారంటీ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు చేయనుంది. సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని ఈ పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి మహిళలు ఆర్డినరీ లేదా ఎక్స్‌ప్రెస్ బస్‌లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
కేసీఆర్ తుంటికి ఆపరేషన్:
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాత్రిపూట బాత్రూంలోకి వెళ్లి రాత్రి 12 గంటల ప్రాంతంలో పడివపడంతో రాత్రి 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజికగూడలోని యశోద హాస్పిటల్ తరలించారు. శుక్రవారం ఆమెకు తుంటి ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. ఇప్పుడు సర్జరీ అనంతరం ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఆయనకు 6 నుంచి 8 వారాలపాటు రెస్ట్ అవసరం అని వైద్యులు సూచించారు.
Also Read: Potato: పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా!.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్.. ‘అది రాయలసీమ యాస’
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్:
ఈ రోజు ఉదయం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తుంది. ఆ తర్వాత ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా చేస్తే తాము ప్రమాణం చేయబోమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్?:
ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి ముందు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. కేసీఆర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నా.. ఏకగ్రీవంగా ఆయననే శాసన సభా పక్షనేతగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం.
Also Read: KCR: హాస్పిటల్‌లో కేసీఆర్.. మరోవైపు BRSLP నేత ఎన్నిక.. గులాబీ ఎమ్మెల్యేల్లో ‘రివేంజ్’ ఆందోళన
ఉద్యమ కేసులు:
2009 నుంచి రాష్ట్ర సిద్ధించిన 2014 జూన్ 2వ తేదీ వరకు మలి దశ తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు వెలువడగానే డీజీపీ రవిగుప్తా వెంటనే పనుల్లోకి దిగారు. మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటం 2009 నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు అన్నింటినీ సమర్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ కేసులు ఎత్తేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉద్యమకారులు స్వాగతిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: నడిరాత్రి నా ఇంటిపై లాఠీలు పడి.. నన్ను నిర్బంధించి.. : సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్
సాగుకు 12 గంటల కరెంటే ఇచ్చాం:
సాగుకు దఫాకు 6 గంటల చొప్పున రోజూ రెండు దఫాలుగా విద్యుత్ అందించామని, రోజుకు 12 గంటల విద్యుత్ వ్యవసాయానికి అందించినట్టు విద్యుత్ సంస్థల అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారంనాటి సమావేశంలో తెలియజేశారు. విద్యుత్ సంస్థలకు రూ. 81 వేల కోట్ల అప్పులు ఉన్నట్టు చెప్పారు.ఇకపై సాగు సహా అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందించాలని సీఎం వారికి సూచించారు.
Also Read: Revanth Reddy: వ్యవసాయానికి 12 గంటలే ఇచ్చాం: సీఎం రేవంత్‌కు విద్యుత్ సంస్థల వివరణ
మహువా పార్లమెంటు సభ్యత్వం రద్దు:
మహువా మోయిత్రాపై బహిష్కరణ వేటుపడింది. టీఎంసీ నుంచి లోక్ సభ ఎంపీగా గెలిచిన ఫైర్ బ్రాండ్ మహువా మోయిత్రా..నగదు, కానుకలకు బదులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎథిక్స్ కమిటీ విచారించింది. 495 పేజీల నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టగా.. అరగంటలోనే దానికి మూజువాణి ద్వారా ఆమోదం లభించింది. మహువా మోయిత్రా అనైతిక పనులు చేసినట్టుగా కమిటీ భావిస్తున్నది కాబట్టి, ఆమె పార్లమెంటులో కొనసాగడం సమంజసం కాదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ తీర్మానంపై మాట్లాడేందుకు మహువాకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు.