మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసుల దుర్మరణం
మహారాష్ట్రలో ఘాట్ రోడ్డు గుండా వెళ్లుతున్న ఎర్టిగా కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు.

హైదరాబాద్: మహారాష్ట్రలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు. కొందరు మిత్రులు విహార యాత్ర కోసం కారులో మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ చికల్‌దరా వద్ద ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరంతా నల్లగొండ, ఆదిలాబాద్‌కు చెందినవారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. గాయపడినవారిని హాస్పిటల్‌కు తరలించారు.
ప్రమాదానికి గురైన కారులో ఆరుగురు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగులు. ఇందులో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టీ)కి చెందినవారు.
Also Read: పైరవీల్లేకుండా గృహలక్ష్మీ.. రెండు నెలల్లో పనులు మొదలుపెట్టకపోతే వేరేవారికి అవకాశం: మంత్రి హరీశ్ రావు
పలు మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో వారు ఉద్యోగులుగా ఉన్నారు. మరికొందరు మిత్రులతో కలిసి మహారాష్ట్రలోని చికల్‌దరాకు విహారయాత్రకు వెళ్లారు. ఇందుకోసం వారు ఎర్టిగా కారును ఎంచుకున్నారు. ఆ కారులోనే వారు వెళ్లుతుండగా అమరావతి జిల్లా వద్ద కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇందులో అర్లి(టీ)కి చెందిన వైభవ్, సల్మాన్‌లు ఉన్నారు. అలాగే.. శివకృష్ణ, కొటేశ్వర్‌లు కూడా మృతి చెందారు. షేక్ సల్మాన్ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే, శ్యామ్ రెడ్డి, సుమన్, యశోద యాదవ్, హరీశ్‌లు తీవ్రంగా గాయపడ్డారు.