దేశంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా రోజువారి కరోనా కేసుల (Corona Cases In Telangana) సంఖ్య గత కొద్ది రోజులుగా పెరుగుతోంది. తాజాగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో (Kukatpally Police station) కరోనా కలకలం రేపింది. 

దేశంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా రోజువారి కరోనా కేసుల (Corona Cases In Telangana) సంఖ్య గత కొద్ది రోజులుగా పెరుగుతోంది. తాజాగా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో (Kukatpally Police station) కరోనా కలకలం రేపింది. మొత్తం నలుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. దీంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఇతర సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నారు. మిగిలిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. మరోవైపు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు ఇటీవల వెళ్లినవారు సైతం ఈ విషయం తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఇక, కరోనా బారినపడ్డ కానిస్టేబుల్స్‌ను, ఇన్‌స్పెక్టర్‌ను కలిసి వారు పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడంతో పాటుగా.. కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు.

మరోవైపు తెలంగాణ సచివాలయంలో కూడా కరోనా కలకలం రేపింది. బీఆర్కే భవన్‌లో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో వైరస్ లక్షణాలున్న ఉద్యోగులు పరీక్షలు చేసుకోగా అందులో నలుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. బిల్డింగ్ లోని గదులన్నీ ఇరుకుగా ఉండటంతో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని ఉద్యోగులు చెప్తున్నారు. 

తెలంగాణలో నిన్న కొత్తగా 2,295 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,89,751కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. తాజాగా కరోనాతో ముగ్గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,039కి చేరింది. నిన్న కరోనాతో 278 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 6,75,851కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,861 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.