హైదరాబాద్: హైదరాబాదులో కరోనా వైరస్ లక్షణాలు హైదరాబాదులోనూ కనిపించడంతో తీవ్ర కలకలం రేగుతోంది. అయితే, ఇప్పటి వరకు కరోనా వైరస్ లక్షణాలను నిర్ధారించలేదు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నలుగురు ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లు మాత్రమే అనుమానిస్తున్నారు. 

Also Read: కరోనా వైరస్ అంటే ఏమిటి.... ? ప్రపంచం ఎందుకు వణికిపోతుందంటే...

చైనాను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనా నుంచి హైదరాబాదు వచ్ిచన ఓ వైద్యుడు జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్ ఆస్పత్రిలో చేరాడు. అతడి రక్తనమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షించింది. అయితే కరోనా వైరస్ లేదని పరీక్షల్లో తేలింది.

See Video: రోనా వైరస్ : ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్న చైనీస్ వైరస్

చైనా, హాంగ్ కాంగ్ ల నుంచి వచ్చినవారిలో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి .భయంతో వారు ముందుగానే వైద్యులను సంప్రదిస్తున్నారు. కాగా, జ్వరంతో నలుగురు ఆదివారంనాడు హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. వీరిలో ముగ్గురు చైనా, హాంగ్ కాంగ్ లనుంచి వచ్చినవారు. మరొకరు వారిలో ఒకరి భార్య. ఈ నలుగురిని ప్రత్యేక గదుల్లో పెట్టి వైద్యులు పరీక్షిస్తున్నారు. 

వారిలో ఒక వ్యక్తి మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నాయి. దీంతో అతని రక్తనమూనాలను సేకరించి పూణేకు పంపించారు. సోమవారం ఆ ఫలితాలు రావచ్చు. మిగిలిన ముగ్గురికి ముక్కు కారడం తప్ప వారిలో ఇతర లక్షణాలు ఏవీ లేవు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారి కోసం ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఎనిమిది పడకల ఐసియూను ఏర్పాటు చేశారు. 

Also Read: కేరళ నర్స్ కి కరోనా వైరస్.... సౌదీకి కూడా పాకేసింది