Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ అంటే ఏమిటి.... ? ప్రపంచం ఎందుకు వణికిపోతుందంటే...

ఇప్పటివరకు ఈ నూతన వైరస్ వల్ల మరణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ... ఇది ప్రపంచ వ్యాప్తంగా పాకడం మొదలయింది. ఇప్పటికే అమెరికాలో, మధ్యప్రాచ్యాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ హై అలెర్ట్ ప్రకటిస్తున్నారు. 

corona virus: all you need to know about the outbreak, symptoms...
Author
Hyderabad, First Published Jan 24, 2020, 12:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యావత్ ప్రపంచమంతా కూడా చైనాలోని వుహాన్ కరోనా వైరస్ పేరు చెబితేనే వణికి పోతుంది. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులను స్క్రీనింగ్ చేస్తూ ఎయిర్ పోర్టుల్లో స్కానర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధికి గల కారణాలేంటి, ఎందుకు ప్రపంచం ఇంతలా వణికి పోతుంది అనే విషయాలను తెలుసుకుందాం. 

కరోనా వైరస్ సాధారణంగా ప్రపంచమంతా కూడా కనిపించే ఒక కామన్ వైరస్. ఈ వైరస్ వల్ల గొంతు, సైనస్, ముక్కు ఇన్ఫెక్షన్లు వాస్తు ఉంటాయి. చాలా వరకు కరోనా వైరస్ లు అంత ప్రమాదకరం కావు. కాకపోతే కొన్ని కరోనా వైరస్ లు మాత్రం చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి. 

ఉదాహరణకు 2012లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ బారిన ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పడ్డారు. మధ్యప్రాచ్యంలో మొదలై కొరియా, అమెరికాల వరకు పాకిన ఈ వైరస్ వల్ల దాదాపుగా 900 మరణాలు సంభవించాయి. అలానే 2002లో సార్స్ వాళ్ళ దాదాపుగా 800 మరణాలు సంభవించాయి. 

Also read; చైనాను వణికిస్తున్న ప్రాణాంతక వైరస్.. భారత్ కు పొంచి ఉన్న ముప్పు?

ఈ రెండు వైరస్ లు కూడా కరోనా జాతికి చెందినవే. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా సార్స్, మెర్స్ వైరస్ ల కేసులు నమోదవలేదు అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజాగా 2020 సంవత్సర ఆరంభంలో చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా మరో కరోనా వైరస్ ని గుర్తించారు. 

2020 జనవరి 20వ తేదీవరకు దాదాపుగా 300 కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ ధృవీకరించింది. ఈ వైరస్ కి 2019 నోవెల్ కరోనా వైరస్ గా నామకరణం చేసిందిప్రపంచ ఆరోగ్య సంస్థ(2019 novel coronavirus (2019-nCoV)). దానర్థం ఇది కొత్త వైరస్ అని. ఎంత కొత్తదంటే...ఇంకా పేరు పెట్టలేనంత!

ఇప్పటివరకు ఈ నూతన వైరస్ వల్ల మరణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ... ఇది ప్రపంచ వ్యాప్తంగా పాకడం మొదలయింది. ఇప్పటికే అమెరికాలో, మధ్యప్రాచ్యాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ హై అలెర్ట్ ప్రకటిస్తున్నారు. 

వ్యాధి లక్షణాలు... 

పొడి దగ్గు, జ్వరం సాధారణంగా కనబడే లక్షణాలు. ఈ వ్యాధి సోకినా వారికి జలుబు, దగ్గు, జ్వరం కరోనా వైరస్ వల్ల వచ్చాయో... లేదా మామూలు జలుబును కలిగించే రైనో వైరస్ వల్ల కలిగాయో కూడా అర్థం కాదు. 

సాధారణంగా ఈ వ్యాధిని పడ్డవారు స్వతహాగా వారంతట వారే కోలుకుంటారు. చాలా తీవ్రమైన పరిస్థితులకు చేరిన వారు మాత్రమే న్యుమోనియా వ్యాధికి గురవుతారు. ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల చనిపోయిన వారంతా ఈ న్యుమోనియా వల్ల మరణించిన వారే. 

ఎలా వ్యాప్తి చెందుతుంది....?

ఈ వైరస్ తొలుత చైనా దేశం లోని వుహాన్ నగరంలో కనబడించి. అక్కడి ఒక సి ఫుడ్ మార్కెట్ నుంచి ఈ వైరస్ మనుషులకు పాకినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also read; విజృంభిస్తున్న కొరోనా వైరస్... చైనాలోని ఐదు పట్టణాలు మూసివేత

తొలుత కేవలం జంతువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందని భావించినా... మార్కెట్లు మూసి ఉన్నప్పటికీ కూడా వేరే ప్రాంతాల్లోనూ ఆ వైరస్ తాలూకు కేసులు బయటపడుతుండడంతో మనుషుల నుండి మనుషులకు కూడా సంక్రమిస్తుందని తేలింది. 

ఎవరెవరికి సోకే ప్రమాదం ఉంది...?

మామూలుగా చాలామంది ప్రజలకు ఈ వైరస్ పాకినప్పటికీ వారిపైన ఈ వైరస్ పెద్ద ప్రభావం చూపే ప్రమాదం లేదు. ఇప్పటివరకు మరణించినవారంతా 40 సంవత్సరాలపైబడినవారే.

ఇంకో విషయం ఏమిటంటే...ఇప్పటివరకు మరణించిన వారందరికీ కూడా అంతర్గతంగా ఏదో ఒక వేరే వ్యాధితో బాధపడుతున్నవారు. ఒకరకంగా చెప్పాలంటే వీరి రోగ నిరోధక శక్తి వీక్ గా ఉండడం వల్ల వీరు మరణించినట్టు మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

చికిత్స ఏమిటి.. ఎలా...?

ఇది వైరస్ అవడం వల్ల ఈ వ్యాధి లక్షణాలను మనం ఆంటిబయోటిక్స్ తో ట్రీట్ చేయలేము. ఆంటిబయోటిక్స్ కేవలం బాక్టీరియా మీద మాత్రమే ప్రభావం చూపిస్తాయి. కాబట్టి దీనికి ఎటువంటి చికిత్స ప్రస్తుతానికైతే లేదు. దీనికి వాక్సిన్ కూడా లేదు. మామూలుగా దగ్గు, జలుబు, జ్వరానికి వాడే సాధారణ మందులు, కొన్ని ఉపశమన చర్యలను మాత్రమే సూచిస్తున్నారు డాక్టర్లు. 

కాబట్టి మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ... అందుకు అనుగుణమైన ఆహారాన్ని తీసుకోవడం, ప్రతిరోజు కొద్దిసేపైనా వ్యాయామం చేస్తే సరిపోతుంది. ఒకవేళ జబ్బు దలుగు తీవ్రమైతే డాక్టర్ని సంప్రదించడానికి తొలి ప్రాధాన్యతను ఇవ్వండి. 

Follow Us:
Download App:
  • android
  • ios