హైదరాబాద్: హైద్రాబాద్‌లోని హస్తినాపురంలో విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఆర్ధిక ఇబ్బందులతోనే ఈ నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read:గద్వాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ: మరో ప్రియుడితో కార్తీక్ హత్య, ప్రియురాలు సూసైడ్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ప్రదీప్, స్వాతి దంపతులు హైద్రాబాద్ హస్తినాపురంలో నివాసం ఉంటున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు.

ఐదేళ్ల కళ్యాణ్ కృష్ణ, ఏడాది వయస్సున్న జయకృష్ణ. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆదివారం నాడు రాత్రి ఇద్దరు  పిల్లలుకు పురుగుల మందు తాగించారు. ఆ తర్వాత ప్రదీప్ , స్వాతిలు కూడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికంగా విషాదం నెలకొంది.