గద్వాల:గద్వాల జోగుళాంబ జిల్లాలో  దారుణం చోటు చేసుకొంది. తమ మధ్య పరిచయాన్ని కుటుంబసభ్యులకు చెబుతానని బెదిరించిన స్నేహితుడిని మరో ఇద్దరితో కలిసి హత్య చేయించింది.  ఈ విషయం బయటకు పొక్కడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గద్వాలలో చోటుచేసుకొంది.

Also read:పాత మిత్రుడు.. పెళ్లి తర్వాత ఫేస్ బుక్ లో పలకరింపు.. చివరకు..

గద్వాలలోని బురదపేటకు చెందిన కార్తీక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.  అతని వయస్సు 31 ఏళ్లు. గద్వాలకు చెందిన రాగసుధ పెళ్లైన తర్వాత మహబూబ్ నగర్ లో  నివాసం ఉంటుంది. కాలేజీలో సహాధ్యాయి కార్తీక్ తో ఆమెకు పరిచయం ఉంది.

తరచూ కార్తీక్ తో ఆమె మాట్లాడేది. ఇదే కాలేజీలో సూపర్ సీనియర్ అయిన రవితో కూడ ఆమె సన్నిహితంగా ఉండేది. కార్తీక్ తో రాగసుధకు విభేదాలు వచ్చాయి.
దీంతో కార్తీక్ తో మాట్లాడడం ఆమె మానేసింది. తమ మధ్య పరిచయం విషయాన్ని కుటుంబసభ్యులకు చెబుతానని రాగసుధను కార్తీక్ బెదిరించాడు.

దీంతో కార్తీక్ ను హత్య చేస్తే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండడదని ఆమె భావించింది. ఈ మేరకు తన సూపర్ సీనియర్ రవికి అసలు విషయం చెప్పింది.కార్తీక్ ను హత్య చేసే పనిని రవి తీసుకొన్నాడు. గత నెల 24వవ తేదీన కార్తీక్ ను గద్వాలకు సమీపంలోని నది అగ్రహారం వద్దకు తీసుకెళ్లారు.

మద్యం తాగించి కార్తీక్ ను ఇనుప రాడ్డుతో కొట్టి హత్యచేశారు. రవి అతని స్నేహితులు.మృతదేహన్ని కొండపల్లి గుట్టల పైకి తీసుకెళ్లి పాతిపెట్టి వెళ్లిపోయారు.కార్తీక్ మృతదేహం బయటపడింది. ఈ విషయం బయటకు వస్తోందనే భయంతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడింది. కార్తీక్ ను హత్య చేసిన రవితో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు.

ఆత్మహత్యకు ముందు రాగసుధ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రాగసుధ ఉపయోగించిన రెండు సెల్ ఫోన్లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  పోలీసుల తీరుపై కార్తీక్ కుటుంబసభ్యులు విమర్శలు చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు కాకుండా సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.