తెలంగాణ మిల్లెట్ మ్యాన్ గా పేరొందిన పిరియాపట్న వెంకటసుబ్బయ్య సతీష్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. ఆయన అంత్యక్రియలు నేడు సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో జరగనున్నాయి.
తెలంగాణలోని జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ (డీడీఎస్ )ను స్థాపించి పర్యావరణహిత వ్యవసాయ ఆహార వ్యవస్థల్లో విశేష కృషి చేసి ‘మిల్లెట్ మ్యాన్’గా పేరొందిన పిరియాపట్న వెంకటసుబ్బయ్య సతీష్ ఇక లేరు. ఆయన అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తన 77 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
1983లో జహీరాబాద్ లో డీడీఎస్ ను స్థాపించిన సతీష్ వ్యవసాయ జీవవైవిధ్యం, ఆహార సార్వభౌమత్వం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, స్థానిక విజ్ఞాన వ్యవస్థలు, భాగస్వామ్య అభివృద్ధి, గ్రామీణ తెలంగాణలో సంప్రదాయ పంటల పరిరక్షణ వంటి అంశాలపై ఉద్యమించారు. తన నమ్మకాలకు కట్టుబడి ఎంతోమంది యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారు.
లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థాన్ అనుకూలవాదుల దాడి.. మండిపడ్డ భారత్...
1945 జూన్ 18న మైసూరులో జన్మించిన సతీష్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం జర్నలిస్టుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించి దూరదర్శన్ కు దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్ గా సేవలందించారు. ఆయన 1970 లలో (సైట్) చారిత్రాత్మక శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ప్రయోగంలో గణనీయమైన పాత్ర పోషించారు.
1980 ల ప్రారంభంలో సతీష్, అతడి కొంతమంది స్నేహితులు సెమీ-శుష్క జహీరాబాద్ ప్రాంతంలో ఆకలి, పోషకాహార లోపం, భూమి క్షీణత, జీవవైవిధ్యం కోల్పోవడం, లింగ అన్యాయం, సామాజిక లేమి వంటి సమస్యలను సమిష్టిగా పరిష్కరించే విస్తృత కార్యక్రమాల కోసం గ్రామాల్లోని పేద దళిత మహిళలను సమీకరించి డీడీఎస్ ను ప్రారంభించారు. దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన నాయకత్వంలో ఈ సంస్థ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఎన్జీవోగా ఎదిగింది. దేశవ్యాప్తంగా చిరుధాన్యాల పునరుద్ధరణకు, ప్రోత్సహించడానికి కార్యక్రమాలు చేపట్టింది.
బీహార్ లో దారుణం.. వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం, వీడియో వైరల్, కేసు నమోదు చేసిన పోలీసులు
చిరుధాన్యాల సాగు, సేంద్రియ సాగు పట్ల అచంచలమైన అంకితభావంతో డీడీఎస్ మహిళా సంఘాలు ఆధిపత్య వ్యవసాయ విధానానికి స్పష్టమైన ప్రత్యామ్నాయాలను అందించడంలో జాతీయ ప్రమాణాలను నిర్దేశించాయి. ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడానికి ఇటీవల చేపట్టిన కార్యక్రమాలకు ఆయన ఆధ్వర్యంలోని డీడీఎస్ కృషి ఎక్కువగా కారణమైంది.
డీడీఎస్ డైరెక్టర్ గా సతీష్ సుదీర్ఘకాలం అందించిన సేవల ఫలితంగా తెలంగాణలోని 75 గ్రామాల్లోని వేలాది మంది నిరుపేద మహిళల జీవనోపాధి మెరుగుపడింది. మిల్లెట్ నెట్ వర్క్ఆఫ్ ఇండియా (మినీ), సౌత్ అగైనెస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ (ఎస్ఏజీఈ), ఏపీ కొయలిషన్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ డైవర్సిటీ, 200కు పైగా పర్యావరణ సమూహాలతో కూడిన ఐదు దేశాల దక్షిణాసియా నెట్ వర్క్ అయిన సౌత్ ఏషియన్ నెట్ వర్క్ ఫర్ ఫుడ్, ఎకాలజీ అండ్ కల్చర్ (ఎస్ఏఎన్ఎఫ్ఈసీ) సహా పలు జాతీయ, అంతర్జాతీయ నెట్ వర్క్ లకు ఆయన నేతృత్వం వహించారు.
స్పెయిన్ లోని బార్సిలోనా కేంద్రంగా పనిచేస్తున్న జెనెటిక్ రిసోర్సెస్ యాక్షన్ ఇంటర్నేషనల్ (జీఆర్ఐఎన్) సంస్థకు బోర్డు సభ్యుడిగా పనిచేశారు. బెల్జియంలోని బ్రస్సెల్స్ కేంద్రంగా ఏర్పాటైన ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ సస్టెయినబుల్ ఫుడ్ సిస్టమ్ లో సభ్యుడిగా కూడా ఉన్నారు. చిరుధాన్యాలను ప్రజల ఎజెండాగా మార్చడంలో ఆయన జీవితకాల కృషికి గాను ఢిల్లీలో జరిగిన పీపుల్స్ కన్వెన్షన్ ఆన్ చిరుధాన్యాల సదస్సులో సన్మానించారు.
అమానుషం.. కరుస్తుందని కుక్కను బండికి కట్టి.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి.. చివరికి..
రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా జహీరాబాద్ లో చాలా మంది సతీష్ మరణవార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. సమాజానికి ఆయన చేసిన సేవలను, సుస్థిర జీవనోపాధి సాధనాలను అభివృద్ధి చేయడానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో జరగనున్నాయి.
