బీజేపీలోకి ఈటల: అనుచరులతో ఇవాళ కూడ భేటీ, త్వరలో ఢిల్లీకి?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అనుచరులతో భేటీ అవుతున్నారు. బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అనుచరులతో ఈటల రాజేందర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

former minister Etela Rajender meeting with his followers lns

హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అనుచరులతో భేటీ అవుతున్నారు. బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అనుచరులతో ఈటల రాజేందర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.  భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో  మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీఆర్ భర్తరఫ్ చేశారు. దీంతో ఆయన  తనకు రాజకీయ అండ కావాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. దీంతో బీజేపీ నేతలతో ఆయన చర్చించారని తెలుస్తోంది.ఇటీవల కాలంలో హైద్రాబాద్ శివారులోని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి  ఫామ్‌హౌస్ లో ఈటల రాజేందర్ చర్చించారు.  హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగితే   మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని బీజేపీ నాయకత్వం తేల్చి చెప్పింది. దీంతో  బీజేపీలో చేరితే ఎలా ఉంటుందనే విషయమై అనుచరులతో ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్నారు. 

also read:బీజేపీయే బెటర్.. కార్యకర్తల ఏకాభిప్రాయం: ఈటలలో అంతర్మథనం, రేపు మీడియా ముందు ప్రకటన..?

బుధవారం నాడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని తన అనుచరులతో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఇవాళ కూడ  మరోసారి అనుచరులతో భేటీ కానున్నారు. తనతో కలిసే వచ్చే నేతలతో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఈటల రాజేందర్  వివరిస్తున్నారు.ఈటలరాజేందర్ ను బీజేపీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడ సానుకూలంగా ఉంది. అయితే  ఈ విషయమై కేంద్ర నాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. కేంద్ర నాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కేంద్ర నాయకులతో ఈటల రాజేందర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఈటల రాజేందర్ ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడ వెళ్లకుండా ఉండేందుకు గాను  గులాబీ బాస్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావును హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలతో హరీష్ రావు సమావేశమయ్యారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios