బీజేపీయే బెటర్.. కార్యకర్తల ఏకాభిప్రాయం: ఈటలలో అంతర్మథనం, రేపు మీడియా ముందు ప్రకటన..?
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత కుంపటి పెట్టుకుంటారా..? రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా..? వంటి ప్రశ్నలు గత కొన్ని రోజులుగా తెలంగాణ సమాజాన్ని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత కుంపటి పెట్టుకుంటారా..? రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా..? వంటి ప్రశ్నలు గత కొన్ని రోజులుగా తెలంగాణ సమాజాన్ని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి మరికొన్ని గంటల్లోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తన అభిమానులు, అనుచరులతో ఈట ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది, రానున్న కాలంలో సొంతగా పార్టీ పెట్టాలా లేక వేరే పార్టీలో చేరాలా అన్న విషయంపై వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. సొంత పార్టీ పెడితే ముందుకు సాగడం ఎలా..?, ప్రజలను అనుకూలంగా మల్చుకునే పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న విషయాలపై కూడా చర్చించినట్టు సమాచారం. వేరే పార్టీలో చేరితే కాంగ్రెస్, బీజేపీల్లో ఏది బెటర్ అన్న విషయంపై కూడా వారిని ఈటల అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
Also Read:బీజేపీలో చేరడం మీద ఈటల క్లారిటీ.. రాజీనామా చేసినాకే... !
ఈ సందర్భంగా తమకంటూ ఒక అండ నాయకులకు నీడను ఉండటంతో పాటు రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలంటే బీజేపీయే బెటర్ అని కార్యకర్తలు ఈటలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోనే ఈటల చేరడం దాదాపు ఖాయమైనట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై గురువారం ఉదయం మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం వుందని హుజురాబాద్‌లో చర్చించుకుంటున్నారు.