Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 68 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ఫోకస్.. త్వరలోనే నోటిఫికేషన్లు..!

ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల (government jobs) భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది నెలలుగా ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. 

CM KCR likely to focus on filling job vacancies notifications may release soon
Author
Hyderabad, First Published Dec 28, 2021, 11:09 AM IST

ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల (government jobs) భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది నెలలుగా ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీలపై ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. ఈ క్రమంలోనే ఉద్యోగ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే నెలలు గడుస్తున్న ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి విసిగిపోయిన కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. 

అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో జిల్లాలు, మల్టీ జోన్లలో ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కేసీఆర్ దృష్టి సారించాలని భావిస్తున్నారు. సీఎం ఆదేశాలతో వివిధ  శాఖల్లో 68 వేల పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి కసర్తతు ఈ ఏడాది జూలైలో పూర్తయింది. అయితే ఉద్యోగులు బదిలీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖాళీలపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయలేదని అధికార వర్గాలు  చెబుతున్నాయి. 

జనవరి మొదటి  లేదా రెండో వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రి వర్గం.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో (TSPSC) పాటుగా, ఇతర నియామక బోర్డులకు పంపాల్సిన ఖాళీల భర్తీపై ప్రధానంగా దృష్టి సారించనుందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక, వివిధ శాఖల్లో 68,000 ఖాళీలను గుర్తించడగా.. అందులో ఎక్కువ పోస్టులు పోలీసు, విద్య, వైద్య, ఆరోగ్య శాఖల్లోనే ఉన్నాయి. ఇక, చాలా జిల్లాల్లో కలెక్టరేట్‌లు, రెవెన్యూ విభాగాల్లో సరిపడ సిబ్బంది లేరని.. కొద్దిపాటి సిబ్బందితోనే నెట్టుకు రావాల్సి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేటాయింపు తర్వాత.. ఎంత మేర సిబ్బంది అవసరమనే స్పష్టత వస్తుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. 

ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు.. 
ప్రభుత్వంపై ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీతో పాటు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరహార దీక్ష పేరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. నెల రోజుల్లోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

మరోవైపు ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని మంత్రులు చెప్పుకొచ్చారు. గత ఏడేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.32 లక్షల ఖాళీలను భర్తీ చేసిందని చెప్పిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఓ జాబితాను విడుదల చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చిత్తశుద్దితో ఉద్యోగాల భర్తీ చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశిస్తూ సంజయ్‌కు బహిరంగ లేఖ రాశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios