కేసీఆర్‌తో మూడు గంటల పాటు కుమారస్వామి భేటీ: జాతీయ రాజకీయాలపై చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మూడు గంటల పాటు భేటీ అయ్యారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో కుమారస్వామి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ ముగిసింది. ఆదివారం నాడు మధ్యాహ్నం హైద్రాబాద్ ప్రగతి భవన్ లో కుమారస్వామి కేసీఆర్ తో భేటీ అయ్యారు. మూడు గంటలకు పైగా కేసీఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి చర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, పార్టీని కూడా ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు కోరారు.
also read:తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమైన కుమారస్వామి.. జాతీయ రాజకీయాలపై చర్చ..!
2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమే అధికారంలోకి రానుందని కేసీఆర్ గత వారంలో నిజామాబాద్ లో నిర్వహించిన సభలో ప్రకటించారు. 2024లో బీజేపీ ముక్త్ భారత్ కోసం తాము క్రియాశీలకంగా వ్యవహరించనున్నామని కేసీఆర్ ప్రకటించారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని కూడా కేసీఆర్ నిజామాబాద్ సభలో ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా పార్టీని ఏర్పాటు చేుయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ విషయమై పలువురితో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.
బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో పాటు సీఎంలతో కూడా కేసీఆర్ చర్చలుజరుపుతున్నారు.గతంలో పలుమార్లు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ చర్చలుజరిపారు. ఇవాళ కుమారస్వామి హైద్రాబాద్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు.
జాతీయ పార్టీ విషయమై కేసీఆర్ కుమారస్వామితో చర్చించారు. పార్టీ జెండా, ఎజెండా వంటి అంశాలపై కేసీఆర్ కుమారస్వామితో చర్చించారు. హైద్రాబాద్ వేదికగానే కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలనే బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కూడా కేసీఆర్ చర్చలు జరిపారు. కేసీఆర్ తో భేటీ ముగిసిన తర్వాత బీహర్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో నితీస్ కుమార్ భేటీ అయ్యారు. బీజేపీయేతర పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయమై కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు.