హైదరాబాద్:  మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయనకు ఆ పార్టీ అగ్రనాయకత్వంతో ఆయన సమావేశమయ్యారు.గత నెల 31వ తేదీన న్యూఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ ఇవాళ ఉదయమే హైద్రాబాద్ కు చేరుకొన్నారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ముగించుకొని ఇవాళ ఉదయమే  ఆయన హైద్రాబాద్ కు చేరుకొన్నారు.

 

ఈ నెల 4వ తేదీన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు.  త్వరలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నేతల సమక్షంలో   ఆ పార్టీలో చేరనున్నారు.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం తనతో చర్చించకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై బుధవారం నాడు పెద్దిరెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు.  బండి సంజయ్ ఫోన్ తో  పెద్దిరెడ్డి మెత్తబడినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

also read:హైదరాబాదుకు రాక: బిజెపిలో చేరికపై ప్రశ్నకు జవాబివ్వని ఈటెల రాజేందర్

భూ కబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుండి  ఈటల రాజేందర్ భర్తరఫ్  అయ్యారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 4 వ తేదీనే బీజేపీలో ఏ రోజున చేరనున్నారో ఆయన ప్రకటించే అవకాశం ఉంది. మరోసారి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందనే సమాచారం.