Asianet News TeluguAsianet News Telugu

పబ్ లో యువతి విషయంలో గొడవ.. యువకుడిని చితకబాదిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు...

జూబ్లీహిల్స్ పబ్ లో ఓ వ్యక్తిమీద మాజీ డీజీపీ గౌతమ్ సంవాగ్ కొడుకు డేవిడ్ సవాంగ్ దాడికి పాల్పడ్డాడు. ఓ యువతి విషయంలో గొడవ జరిగిందని సమాచారం. 

Former DGP Gautam Sawang son fighting in a pub - bsb
Author
First Published Sep 14, 2023, 10:53 AM IST

హైదరాబాద్ : ఏపీ మాజీ ఉన్నతాధికారి కొడుకు మీద ఆఫ్రికన్ల దాడి కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న జీరో 40 పబ్ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కొడుకు డేవిడ్ సవాంగ్ ఉన్నాడు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మరో వర్గంలో సిద్ధార్థ మాగ్నం అనే యువకుడు ఉన్నాడు.

కాగా, బుధవారం రాత్రే సిద్ధార్థ మాగ్నంపోలీసులను ఆశ్రయించాడు. తన మీద ఆఫ్రికన్లతో కలిసి మొత్తం ఆరుగురు దాడి చేసినట్లుగా ఫిర్యాదు చేశాడు. దాడిలో ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఉన్నట్లు తెలిపాడు. కాగా, వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది.  అయితే పోలీసులు మాత్రం పార్కింగ్ విషయంలో గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు.

జూబ్లీహిల్స్ లో ఏపీ మాజీ ఉన్నతాధికారి కొడుకుపై ఆఫ్రికన్ల దాడి...

ఈ గొడవలో సిద్ధార్థ మాగ్నం, డేవిడ్ సవాంగ్ లిద్దరికీ గాయాలయ్యాయి. పోలీసులకు దాడులకు సంబంధించి సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డేవిడ్ సవాంగ్ స్నేహితులకు పంపిన మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.

తనకు కుక్కలు అంటే ఇష్టం అని.. కానీ అవి తిరిగి మొరిగితే తాను చూస్తూ ఊరుకోనని చెప్పుకొచ్చాడు. కామ్ గా ఉంటే బెటర్ అంటూ తెలిపాడు.  దీంతో దాడి చేసిన సిద్ధార్థ గురించి ఈ మెసేజ్ పెట్టాడని మాట్లాడుకుంటున్నారు. డేవిడ్ సవాంగ్ కూడా తన మీద దాడి జరిగినట్లు నేడు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. 

ఇంకోవైపు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపి ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సావాంగ్ కొడుకు డేవిడ్ సవాంగ్ విచక్షణ రహితంగా మరోక యువకుడిని చితకబాదాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఈ ఘటనపై మాజీ డీజీపి గౌతం సవాంగ్ ని వివరణ కోరగా.. బాధితులను మాజీ డీజీపి గౌతం సవాంగ్  బెదిరించినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios