కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్.. వాకర్ సాయంతో నడిపించిన డాక్టర్లు.. (వీడియో)
KCR Health update : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. దీంతో ఆయన కోలుకుంటున్నారు. వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన శనివారం ఉదయం నడిచేందుకు ప్రయత్నించారు.
Telangana Former cm kcr : ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడి గాయాలపాలైన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. డాక్టర్లుకు ఆయనకు శుక్రవారం సాయంత్రం విజయవంతంగా హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యశోద హాస్పిటల్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని, ఐవీ ఫ్లూయిడ్స్, ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్, పెయిన్ మెడిసిన్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన ఆరు నుంచి ఎనిమిది వారాల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు.
నేడు కొలువుదీరనున్న తెలంగాణ కొత్త అసెంబ్లీ.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు..
కాగా.. సర్జరీ పూర్తయిన అనంతరం పూర్తిగా విశ్రాంతి తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్ శనివారం ఉదయం నడిచేందుకు ప్రయత్నించారు. ఆయనను వాకర్ సాయంతో డాక్టర్లు మెళ్ల మెళ్లగా నడపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది. దీంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉన్న బాత్ రూంలో కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు గాయాలు కావడంతో హుటా హుటిన యశోద హాస్పిటల్ కు తీసుకొచ్చారు. దీంతో పరీక్షలు జరిపిన డాక్టర్లు తుంటి ఎముక విరిగిందని నిర్ధారించి, సర్జరీ చేయాలని నిర్ణయించారు. కాగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు.
తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు.. కొత్త ఐటీ మినిస్టర్ ఆయనే..
దీంతో పాటు హెల్త్ సెక్రటరీని నేరుగా హాస్పిటల్ కు పంపించారు. హాస్పిటల్ చుట్టు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ శుక్రవారం పోస్టు పెట్టారు. అలాగే టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా లోకేష్ కూడా ఆకాంక్షించారు.