చేప మందు పంపిణీ ముగిసింది

fish prasadam distribution went off peacefully this morning
Highlights

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  చేపమందు పంపిణీ  శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ముగిసింది. 60 వేల మందికి  చేపమందును పంపిణీ చేసినట్లు మత్స్య శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు.

 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  చేపమందు పంపిణీ  శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ముగిసింది.

60 వేల మందికి  చేపమందును పంపిణీ చేసినట్లు మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు.

చేపమందు పంపిణీ కి సహకరించిన బత్తిన హరనాథ్ సోదరులకు, జిహెచ్ ఎంసి, పోలీస్ మెట్రో వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, రెవిన్యూ తదితర శాఖల అధికారులకు   మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

చేపమందు పంపిణీ వద్ద భోజన సౌకర్యం కల్పించిన, ఇతర సేవలు అందించిన స్వచ్చంద సంస్థలను ఆయన అభినందించారు. ఇంకా చేపమందు తీసుకోవాలనుకుంటున్న వారు   దూద్ బౌల్ లో ని  బత్తిని  హరనాథ్ గౌడ్ నివాసంలో పొందవచ్చని మంత్రి సూచించారు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader