నేడు టీడీపీ-జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్.. వివాదాలు లేని స్థానాలే ప్రకటించే ఛాన్స్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Andhra pradesh assembly elections 2024) కోసం నేడు టీడీపీ-జనసేనలు (TDP-JANASENA)ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నాయి. ఉదయం 11.40 గంటలకు చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), పవన్ కల్యాణ్ (pawan kalyan)లు ఈ జాబితాను విడుదల చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నాయి. దానిని ఎదుర్కొనేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమిస్తూ మూడు జాబితాలను విడుదల చేసింది. అలాగే టీడీపీ, జనసేన రెండు చోట్ల తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది. కానీ కొన్ని స్థానాల్లో రెండు పార్టీల నాయకులు పోటీ పడాలని భావిస్తున్నారు.
పబ్లిక్ పార్కుల్లో రొమాన్స్.. జంటలను అదుపులోకి తీసుకున్న షీ టీమ్స్..
ఈ విషయంపై ఇంకా చర్చలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే వివాదాలు లేని స్థానాల జాబితాను విడుదల చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ ఉమ్మడి జాబితా నేడు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. 60-70 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో ఉండనున్నాయి. ఇందులో టీడీపీకి 50 పైగా జనసేన నుంచి10 కి పైగా సీట్లు ఉండే అవకాశం ఉంది.
వ్యభిచార దందా నడుపుతున్న బీజేపీ నేత అరెస్ట్..
కాగా.. నేటి (శనివారం) ఉదయం 9 గంటలకు టీడీపీ ముఖ్య నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. వీరిద్దరూ కలిసి ఉదయం 11.40 గంటలకు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు.
సింహాలకు సీత, అక్బర్ పేర్లు.. ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడంపై హైకోర్టు ఫైర్..
అయితే రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లలో ఒకరిద్దరికి మినహా మిగతా వారందరికీ సీట్లు కేటాయించారని తెలుస్తోంది. కాగా.. బీజేపీ తో పొత్తులపై క్లారిటీ వచ్చిన తరువాత మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని ఇరు పార్టీల అధినేతలు భావిస్తున్నారు.