వ్యభిచార దందా నడుపుతున్న బీజేపీ నేత అరెస్ట్..
వ్యభిచార దందా నడుపుతున్నారనే ఆరోపణలపై బీజేపీ నాయకుడు ఒకరు అరెస్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరాలోని సబ్యసాచి ఘోష్ అనే నాయకుడు తన హోటల్ వ్యభిచారం జరిపిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యభిచార దందా నడుపుతున్న పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సబ్యసాచి ఘోష్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సందేశ్‌ఖాలీ విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ దాడి చేస్తున్న నేపథ్యంలో ఇది వెలుగులోకి వచ్చింది. సందేశ్‌ఖాలీలో చాలా మంది మహిళలు తమపై టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్, ఆయన సహచరులు లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
దీపం వెలిగించి మేడారంకు.. ఇంట్లో పేలిన సిలిండర్.. శబ్దంతో జనం పరుగులు..వైరల్
తాజాగా వ్యభిచార దందా కేసులో బీజేపీ నాయకుడు అరెస్ట్ కావడంతో టీఎంసీ కాషాయ పార్టీపై దాడిని తీవ్రతరం చేసింది. హౌరాలోని సబ్యసాచి ఘోష్ హోటల్‌లో నడుస్తున్న వ్యభిచార రాకెట్‌ను బెంగాల్ పోలీసులు చేధించారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీ మధ్యవర్తులను రక్షించిందని, మహిళలను కాదని ఆరోపించింది.
జర్నలిస్ట్ శంకర్ పై మూకుమ్మడి దాడి.. సీసీ కెమెరాలో ఘటన రికార్డు.. ఖండించిన మాజీ మంత్రులు..
ఈ మేరకు టీఎంసీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో ఓ పోస్టు పెట్టింది‘‘బీజేపీ బెంగాల్ నాయకుడు సబ్యసాచి ఘోష్ హౌరాలోని సంక్రైల్ లోని తన హోటల్ లో మైనర్ బాలికల వ్యభిచార రాకెట్ నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు 11 మంది నిందితులను అరెస్టు చేశారు. ఆరుగురు బాధితులను రక్షించారు. ఇది బీజేపీ.. వారు మహిళలను రక్షించరు. దళారులను రక్షిస్తారు’’ అని ఆరోపించింది.
సందేశ్‌ఖాలీ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ మహిళా కార్యకర్తల ప్రతినిధి బృందం గురువారం సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని సందర్శించాలని భావించింది. అయితే దానిని పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ లాకెట్ ఛటర్జీ, ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ నేతృత్వంలోని బీజేపీ బృందం వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. ‘‘నిషేధాజ్ఞల కారణంగా పోలీసులు మమ్మల్ని సందేశ్ ఖాలీలోకి అనుమతించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది’’ అని అగ్నిమిత్రపాల్ ఆరోపించారు.