Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో కారు మెకానిక్ షెడ్ లో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డ్ సజీవ దహనం..

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. కారు షెడ్ లో మంటలు అంటుకుని ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. 

fire broke out in a car shed in Hyderabad, security guard was burnt alive - bsb
Author
First Published Mar 25, 2023, 7:47 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం అబిడ్స్ లోని బొగ్గుల కుంట ప్రాంతంలో ఓ కారు మెకానిక్ షెడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో ఉన్న సెక్యురిటీ గార్డు మంటలకు సజీవ దహనం అయ్యాడు. అగ్నిప్రమాదం కారణంగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. 

ఏడు కార్లు మంటలకు పూర్తిగా దహనం అయిపోయాయి. దీనికి సంబంధించిన సమాచారం అందండంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. కారులో సజీవదహనం అయిన సెక్యూరిటీ గార్డును సంతోష్ గా గుర్తించారు. అయితే, అగ్నిప్రమాదానికి కారణం కారులో మస్కిటో కాయిల్ పెట్టడం వల్లే.. మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

యువతితో సహజీవనం చేస్తూ.. మరో మహిళతో పెళ్లి, పిల్లలు.. చచ్చిపో అంటూ వేధింపులు.. చివరికి ఆమె చేసిన పని..

కారు షెడ్ ఓపెన్ ఎయిర్ లో ఉంది. విద్యుత్ షార్ట్స్ సర్క్యూట్ వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా? అని అనుమానించడానికి తగిన ఆధారాలు లేవు. అక్కడ వైర్లు.. కరెంట్ లాంటివేవీ లేవు. అయితే సంతోష్.. రోజూ దోమల బెడదకు ఇలాగే పడుకుంటాడని తెలిసింది. కారులో మంటలు, పొగ వ్యాపించినా అతనికి మెలుకువ రాలేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో సంతోష్ మద్యం సేవించి ఉన్నాడని తెలుస్తోంది. 

కారులో మంటలు చెలరేగినా.. కారు డోర్లు తెరుచుకోరాకుండా లాక్ అవ్వడం వల్లే సంతోష్ మృతి చెంది ఉంటాడని.. అతనికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. సంతోష్ మృతి విషయం విని ఘటనా స్థలికి చేరుకున్న అతని తలిదండ్రులు రోదనలు మిన్నంటాయి. అతడిని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోష్ కుటుంబాన్ని పోషించడం కోసం చాలా కష్టపడతాడని వారు చెబుతున్నారు. 

సంతోష్ పగలు చెప్పుల షాపు నడిపిస్తాడని.. రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని.. అతని తండ్రి తెలిపాడు. పిల్లల ఫీజులు కట్టేదుందని.. ఇంటికొస్తానని చెప్పాడన్నారు. శుక్రవారం రాత్రి 12.30కు ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడాడు. తెల్లారి డ్యూటీ అయిపోయాక ఇంటికి వస్తానని చెప్పాడని తల్లిదండ్రులు అంటున్నారు. సంతోష్ కు ఓ కూతురు, కొడుకు ఉన్నాడు. భర్త చనిపోయిన విషయం నమ్మలేక పోతున్నానని ఆ భార్య గుండెలవిసేలా రోధిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios