పదేళ్ల చిన్నారిపై కన్న తండ్రి అత్యాచారయత్నం : పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి

Father Rape Attempt On His Own Minor Daughter In malkajgiri
Highlights

మల్కాజిగిరి లో అమానుషం

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే ఆ చిన్నారిని కాటేయాలని చూశాడు. పదేళ్ల వయసున్న కన్న కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఈ కామాంధుడు మానవ సంబంధాలకు మచ్చ తీసుకువచ్చాడు. ఈ ఘటన మల్కజిగిరి పరిధిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి జేఎల్‌ఎస్‌ నగర్‌కు చెందిన కూకట్ల నాగరాజు(33), చంద్రకళ దంపతులు. వీరికి పదేళ్ల వయసున్న కూతురు, ఏడేళ్ల వయసున్న ఓ కొడుకు ఉన్నారు. 

 దీంతో మద్యానికి బానిసైన నాగరాజు ఇంటికి తాగివచ్చి భార్యి పిల్లల్ని వేధించేవాడు. దీంతో చంద్రకళ తన ఇద్దరు పిల్లలను ఇంటికి దూరంగా హాస్టల్ లో ఉంచి చదివిస్తోంది.

అయితే వేసవి సెలవులు కావడంతో ఈ నెల 2వ తేధీన కూతురు ఇంట్లోనే ఉంది. కూతురుని ఒంటరిగా వదిలేసి తల్లి పనిపై బైటికి వెళ్లింది. ఇదే సమయంలో ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన నాగరాజు ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురుని చూశాడు. దీంతో అతడిలోని కామాంధుడు మేల్కొన్నాడు. కన్న కూతురు, చిన్న పిల్ల అన్న విషయాన్ని కూడా మరిచి పాపపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే భయపడిపోయిన చిన్నారి అరవడంతో చుట్టుపక్కల వారు రావడంతో నాగరాజు చిన్నారిని వదిలిపెట్టాడు.

కూతురిపై భర్త అత్యాచార యత్నం చేశాడని ఆలస్యంగా తెలుసుకున్న తల్లి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొన్న నిందితుడు నాగరాజును  అరెస్ట్‌ చేశారు.  

loader