Asianet News TeluguAsianet News Telugu

కూతురు బతికుండగానే పెద్దకర్మ.. ఓ తండ్రి అమానుషం.. కారణం ఏంటంటే...

కూతురు బతికుండగానే పెద్దకర్మ నిర్వహించాడో తండ్రి. కూతురు వేరే వ్యక్తికి వెళ్లిపోవడంతో ఈ చర్యకు దిగాడు. 

father done last rituals to his daughter over elope with lover in nizamabad - bsb
Author
First Published Sep 15, 2023, 4:06 PM IST

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ తండ్రి తన కూతురు బతికుండగానే పెద్దకర్మ చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... నిజామాబాద్ లో మహేష్ అనే వ్యక్తికి నందిని అనే కూతురు ఉంది. నందినికి పెళ్లి చేశాడు. కానీ అల్లుడికి బోన్ క్యాన్సర్ ఉంది.  

ఈ విషయం తెలియడంతో నందిని తల్లి గారింటికి వచ్చేసి ఇక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలో నందినికి ఓ వ్యక్తితో పరిచయం అయి.. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమించిన వ్యక్తితో ఆమె పారిపోయింది. ఈ విషయం మీద మహేష్ తీవ్ర కోపానికి వచ్చాడు. 
కూతురుమీద ఆగ్రహంతో ఆమె చనిపోయిందని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. గురువారం నాడు మరణం ‘10-09-2023’ అంటూ పెద్దకర్మ చేశాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జనవరిలో మహబూబ్ నగర్ లో జరిగింది. మహబూబ్ నగర్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో ప్రేమగా చూసుకున్నా.. కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు ప్రేమపెళ్లి చేసుకుందని ఆమె బతికుండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు. 

చంద్రబాబు విడుదల కావాలంటూ టీటీడీపీ నిరసన.. బల్కంపేట ఎల్లమ్మకు కాట్రగడ్డ ప్రసూన బోనం

ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవికి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరు సమీప బంధువులే అని తెలిసింది. బంధువులే కావడంతో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 

తాము ప్రేమించుకున్నామని.. పెళ్లి చేయాలని ఆ జంట పెద్దను కోరారు. అందుకు ఇరు కుటుంబంలోని పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఈ నెల 13న పెద్దలను ఎదిరించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇది వీరి పెద్దలకు కోపాన్ని తెప్పించింది. బంధువుల అబ్బాయే.. అమ్మాయే అయినా పెళ్లికి వారు ఇష్టపడలేదు. భార్గవి తండ్రి మాత్రం  కక్ష సాధించాడు. తన మాట కాదని పెళ్లి చేసుకుంది.. కాబట్టి తన కూతురు తనకు చచ్చిపోయిందని నిర్ణయానికి వచ్చాడు. అదే ప్రకటించాడు. 

అంటితో ఆగకుండా.. తమ కూతురు తమను కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు కూతురుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తన కూతురు చనిపోయింది అంటూ గుండు గీయించుకున్నాడు. ఆమెకు  కర్మకాండలు కూడా జరిపించాడు. దీనికోసం ఫ్లెక్సీలు కూడా ముద్రించాడు. కూతురు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కీ.శే. కమ్మరి భార్గవి.. జననం.. మరణం అంటూ.. పెళ్లి చేసుకున్న తేదీని వేసి మరీ నివాళులు అర్పించాడు. 

కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేక తండ్రి చేసిన ఈ పని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.  ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, గ్రామంలో మరో మాటా వినిపిస్తోంది. కూతురు ఇష్టం మేరకు పెళ్లి చేస్తానని సదరు తండ్రి చెప్పినా…  యువతీ, యువకుడు వినలేదని  స్థానికంగా ప్రచారం సాగుతోంది. 

తండ్రి పెళ్లి చేస్తానని చెప్పినా.. ఆ మాటపై నమ్మకం లేకనే ఆ యువతి గుడిలో ప్రేమ పెళ్లి చేసుకుందని కొందరు చెబుతున్నారు. అందుకనే తండ్రికి ఆ స్థాయిలో కోపం వచ్చిందని.. తన మాటకు విలువ ఇవ్వని బిడ్డకు పిండ ప్రధానం చేసి ఆక్రోశం వెళ్లగక్కాడు అని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios