Asianet News TeluguAsianet News Telugu

కోట్ల ఆస్తి ఉంది.. రూ.40లక్షల కోసం ఆత్మహత్య చేసుకుంటారా..?

అంతేకాకుండా మంచి ఉద్యోగం ఉందని.. కేవలం రూ.40లక్షల అప్పు కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తమ కూతురు, అల్లుడి మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవని చెప్పుకొచ్చారు.

father comments over  software engineer Family suicide case in hyderabad
Author
Hyderabad, First Published Mar 2, 2020, 12:06 PM IST

హైదరాబాద్ నగరంలో ని హస్తినపురంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రూ.40లక్షల అప్పు ఉందని.. ప్రదీప్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్య స్వాతి,  ఇద్దరు బిడ్డలకు విషం ఇచ్చి చంపేసి.. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. తమ అల్లుడికి రూ. కోట్ల ఆస్తి ఉందని ప్రదీప్ భార్య స్వాతి తండ్రి చెప్పారు. 

Also Read హైద్రాబాద్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య...

సోమవారం స్వాతి తండ్రి మీడియాతో మాట్లాడారు. తమ అల్లుడు రాసిన సూసైడ్ నోట్ లో రూ.40లక్షల అప్పు ఉందని రాశారని.. అయితే... తమ అల్లుడికి రూ.కోట్లల్లో ఆస్తి ఉందని.. అంతేకాకుండా మంచి ఉద్యోగం ఉందని.. కేవలం రూ.40లక్షల అప్పు కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. తమ కూతురు, అల్లుడి మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవని చెప్పుకొచ్చారు.

అనంతరం ప్రదీప్ తండ్రి మాట్లాడుతూ.. శుక్రవారం కూడా తాను తన కొడుకు ప్రదీప్ తో మాట్లాడనని చెప్పారు. కరీంనగర్ వెళ్తున్నానని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అయితే... ఆదివారం వరకూ కనీసం ఒక్క ఫోన్ కూడా రాకపోవడంతో హస్తీనాపురం వచ్చామని చెప్పారు. ఇంటికి సెంట్రల్ లాక్ వేసి ఉండటంతో పోలీసుల సహాయంతో డోర్లు పగలకొట్టి చూశామని చెప్పారు.

అయితే.. అప్పటికే నలుగురు శవాలై కనిపించారంటూ ప్రదీప్ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. సూసైడ్ నోట్ ప్రదీప్..‘‘ తాను మంచిగా, గొప్పగా బ్రతకాలి అనున్నాను. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాను. నష్టపోయాను., ఈ వయసులో నిన్ను ఇబ్బంది పెట్టకూడదని, నా పిల్లలు నీకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నాం, క్షమించు నాన్న’ అంటూ పేర్కొనడం గమనార్హం. కేవలం రూ.40లక్షల కోసం తన కొడుకు ప్రాణాలు తీసుకుంటాడని తాము ఊహించలేదని ప్రదీప్ తండ్రి బోరుమన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios