మెదక్: బోరు బావిలో పడిపోయిన మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్ ను కాపాడేందుకు తల్లి, తాత ప్రయత్నించారు. కానీ, ఫలితం దక్కలేదు. చీర, దోతిలను కలిపి కట్టి బోరు బావిలోకి వేశారు. కానీ, ఆ బాలుడి దాన్ని పట్టుకోలేక లోపలికి పడిపోయినట్టుగా తల్లి నవీన చెప్పారు. 

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలో 120 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో మూడేళ్ల బాలుడు సాయి వర్ధన్ బుధవారం నాడు సాయత్రం పడిపోయాడు.

also read:తల్లి, తాత కళ్ల ముందే బోరు బావిలో పడిన మూడేళ్ల సాయివర్ధన్

తల్లితో కలిసి వెళ్తున్న సమయంలో బోరు బావి పక్క నుండే వెళ్లారు. ఆ సమయంలో బోరులోకి చిన్నారి కాళ్లు పడ్డాయి. ఈ సమయంలోనే తాతా అంటూ ఆ బాలుడు అరిచాడు. బాలుడి వెనుకే ఉన్న తాతా ఆ బాలుడిని పట్టుకొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బాలుడిని తాత అందుకోలేకపోయాడు.

అయితే వెంటనే చీరతో పాటు ధోతిని కలిపి కట్టి బోరు బావిలోకి వదిలారు. దీన్ని ఆ బాలుడు పట్టుకొంటే పైకి లాగుద్దామని తల్లి, తాతలు ప్రయత్నించారు. కానీ, ఆ బాలుడు దాన్ని పట్టుకోలేకపోయాడు. అదే సమయంలో బాలుడిపై కొంత మట్టి కూడ పడిపోయినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.

ఆ తర్వాత బాలుడిని కాపాడేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు. తండ్రి కోసం ఆ బాలుడు అరిచాడు. ఆ సమయంలో తండ్రి దూరంగా ఉన్నాడు.  బోరు బావిలో పడిన కొద్దిసేపటి వరకు బాలుడితో పేరేంట్స్ మాట్లాడే ప్రయత్నం చేశారు.  కొద్దిసేపటి వరకు బాలుడి నుండి మాటలు విన్పించాయి. కానీ ఆ తర్వాతి నుండి ఎలాంటి అలికిడి లేదని తెలిపారు పేరేంట్స్.