హైదరాబాద్:  తల్లితో పాటు  వెళ్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు బాలుడు బోరు బావిలో  బుధవారం నాడు సాయంత్రం మూడేళ్ల బాలుడు సాయి వర్ధన్ పడిపోయాడు.

గోవర్ధన్ తన పొలంలో మూడు బోర్లను వేశాడు. మూడింటిలో ఒక్క దానిలో కూడ నీరు రాలేదు. బోరు బావిని పూడ్చేందుకు గోవర్ధన్ ప్రయత్నాలను ప్రారంభించాడు. 

బోరు బావిని తవ్విన కొద్దిసేపటికే ఆ బోరు బావిలో బాలుడు  పడిపోయాడు. తాత, తల్లి కళ్ల ముందే సాయి వర్దన్ బోరు బావిలో పడిపోయాడు.తల్లితో కలిసి వెళ్తున్న సమయంలోనే బాలుడు పడిపోయినట్టుగా తెలుస్తోంది.

also read:మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

బాలుడిని రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.  రెండు అంబులెన్స్ లు సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి. బోరు బావిలోకి ఆక్సిజన్ పంపేందుకు అధికారులు  ఏర్పాట్లు  చేస్తున్నారు. 

బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వే ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘటన స్థలంలోనే కలెక్టర్, ఎస్పీలు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోవర్ధన్ మూడు బోరు బావులను తవ్వించాడు. అయితే రెండో బోరు బావిలో సాయి వర్ధన్ పడిపోయాడు. బాలుడు ఎంత లోతులో పడిపోయాడనే విషయాన్ని గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.