హైదరాబాద్ శివారులోని అత్తాపూర్ లో ఇద్దరు దుండుగులు నకిిలీ పోలీసుల అవతారమెత్తి వసూళ్ళను పాల్పడుతున్న వ్యవహారం వెలుగుచూసింది.
రంగారెడ్డి : హైదరాబాద్ శివారులో నకిలీ పోలీసులు రెచ్చిపోయారు. ఇద్దరు డ్రైవర్లను అడ్డుకుని పోలీసులమంటూ బెదిరించి అందినకాడిన దోచుకున్నారు దుండుగులు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ పోలీసుల వ్యవహారం బయటపడింది.
పోలీసులు, బాధిత డ్రైవర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పాండురంగనగర్ లో ఇద్దరు దుండుగులు ప్రజల్లో పోలీసులపై వుండే భయాన్ని క్యాష్ చేసుకోవాలని భావించారు. దీంతో నకిలీ పోలీసుల అవతారం ఎత్తి వాహనదారులను బెదిరించి వసూళ్లకు తెగబడ్డారు.
ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను అడ్డుకుని బెదిరించిన నకిలీ పోలీసులు వారి జేబులోంచి రూ.3వేల నగదు, రెండు సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బాధితులిద్దరు తమ సెల్ ఫోన్ల కోసం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులెవ్వరూ తీసుకోలేదని... అసలు తనిఖీలే చేపట్టలేదని తెలిపారు. దీంతో పోలీసులమంటూ ఎవరో దుండగులు వారిని దోచుకున్నట్లు తేలింది.
Read More సికింద్రాబాద్‌లో భారీ చోరీ : రూ.5 కోట్ల సొత్తు అపహరణ, పనిమనుషుల పనేనా.. నేపాల్ బోర్డర్‌కి పోలీసులు
నకిలీ పోలీసుల చేతిలో మోసపోయిన ఇద్దరు డ్రైవర్ల నుండి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్లను పోలీసులమంటూ బెదిరించింది ఇద్దరు పంజాబీ వ్యక్తులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసారు.
