జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కంటి సమస్యతో పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను ఆయన సంప్రదించారు. 

హైదరాబాద్‌: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కంటి సమస్యతో పది రోజుల క్రితం ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులను ఆయన సంప్రదించారు. 

ఎడమ కంటిలో కురుపు అయిందని, దానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. దాంతో బుధవారం పవన్‌ ఆసుపత్రిలో చేరి కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు.

కాగా, ఉత్తరాంధ్రలో పోరాట యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ తిరిగి తన యాత్రను ఈ నెల 16వ తేదీన ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆయన ఇటీవల హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు.