వివాహేతర సంబంధం మూడు ప్రాణాలను బలిగొంది. రెండేళ్ల చిన్నారిని హతమార్చి ఆ ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. 

వివాహేత‌ర సంబంధాలు ఎంత‌టి దారుణానికి అయిన ఒడిగ‌ట్టేలా చేస్తున్నాయి. చ‌క్క‌గా సాగిపోతున్న కాపురంలో ఇలాంటి చ‌ర్య‌లు నిప్పులు పోస్తున్నాయి. హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం అవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో వివాహేత‌ర సంబంధం మూడు ప్రాణాల‌ను బ‌లిగొంది. ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి ఉండ‌టం విషాద‌క‌రం.

‘చాలా అబద్ధాలు చెప్పా.. నా మాటలన్నీ నాటకమే’.. ఇంజినీర్ బలవన్మరణం..

వారిద్ద‌రూ భార్యా భ‌ర్త‌లు. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే ఆ మ‌హిళ భ‌ర్త‌కు తెలియ‌కుండా అత‌డి సోద‌రుడితో వివాహేతర సంబంధం కొన‌సాగించింది. అయితే ప్రియుడితో ఆ సంబంధాన్ని ఆపేయ‌డం ఇష్టంలోని ఆ మ‌హిళ చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది. దాని కంటే ముందు చిన్నారిని హ‌త‌మార్చి, త‌రువాత ప్రియురాలు, ప్రియుడు కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలోని ప‌టాన్ చెరు మండలంలో చోటు చేసుకుంది.

ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: బీజేపీ అగ్రనేతలతో భేటీ

ప‌టాన్ చెరు మండలంలోని బానూరులో గ‌జేంద్ర కుసుబ, రేఖ దంప‌తులు నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల వ‌య‌స్సున్న సోన‌మ్ అనే కూతురు ఉంది. వీరు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన వారు. స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో గ‌జేంద్ర ప‌ని చేస్తుండ‌గా.. భార్య ఇంటి వ‌ద్దే ఉండేది. అయితే గ‌జేంద్ర త‌మ్ముడు బ‌సుదేవ కుసుబ కూడా అదే గ్రామానికి వ‌చ్చాడు. వీరి నివాసం ప‌క్క‌నే గ‌దిలో ఉంటున్నాడు. ఓ ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. 

అయితే రేఖ‌, బ‌సుదేవ మ‌ధ్య మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఉన్న‌ప్పుడే వివాహేత‌ర సంబంధం కొన‌సాగింది. ఈ విష‌యం అక్క‌డే పెద్దల దృష్టికి వెళ్లింది. అక్క‌డ పెద్దల స‌మ‌క్షంలో ఇరువురికి స‌ర్దిచెప్పారు. త‌రువాత గ‌జేంద్ర కుసుబ త‌న భార్యను తీసుకొని బ‌తుకుదెరువు కోసం సంగారెడ్డికి వ‌చ్చి ఉంటున్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డికి కూడా బసుదేవ వ‌చ్చి ఆమెతో త‌న సంబంధాన్ని కొన‌సాగించాడు. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాత్రి భార్య, సోద‌రుడు ఒకే గ‌దిలో ఉండ‌టాన్ని గ‌జేంద్ర చూశాడు. అయితే ఈ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో ఎవ‌రికీ తెలియ‌దు. కొంత స‌మ‌యం త‌రువాత రెండేళ్ల చిన్నారి సోన‌మ్ ను త‌ల్లి హ‌త‌మార్చింది. అనంత‌రం బ‌సుదేవ‌, రేఖ కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. 

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్దం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు.