ఢిల్లీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: బీజేపీ అగ్రనేతలతో భేటీ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం నాడు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కానున్నారు. 

Munugode MLA Komatireddy Rajgopal Reddy leaves For Delhi

హైదరాబాద్: Munugode MLA  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. BJP  అగ్రనేతలతో Komatiredy Rajagopal Reddyభేటీ కానున్నారు. ప్రధాని Narendra Modiతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి.  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను గురువారం నాడు పంపారు. ఈ నెల 8వ తేదీన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా రాజీనామా లేఖను అందించనున్నారు

గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత నెలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.ఈ బేటీ తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని  తేలిపోయింది.అయితే ఈ ప్రచారాన్ని తొలుత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. నియోజకవర్గంలో మండలాలవారీగా కార్యకర్తలు, ముఖ్య నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయమై చర్చించారు. ఈ చర్చల తర్వాత ఈ నెల 2వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో కాంగ్రెస్,టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలతో కమలదళ నేతలు చర్చలు జరుపుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నుండి మరో 12 మంది ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు.ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం నాడు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా చేసేందుకు కమలం నేతలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరుణంలో ఆయా జిల్లాల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి  ఆహ్వానిస్తున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో బృందం గత మాసం చివరి వారంలో భేటీ అయింది. తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న నేతల జాబితాను ఈటల రాజేందర్ బృందం జేపీ నడ్డాకు అందించింది. ఆయా నేతలు పార్టీలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా బీజేపీ అగ్రనేతలకు అందించింది రాజేందర్ బృందం.

also read:మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్దం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఆ పార్టీకి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై కూడా కన్పించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై కూడా కన్పించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఊపు వచ్చింది. ఈ తరుణంలో ఇటీవల కాలంలో కొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు దంపతులు కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా  కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు. ఈ తరుణంలో బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకొనేందుకు చేసిన ప్లాన్ ఫలితాన్ని ఇచ్చింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios