మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్దం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తమ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమన్నారు.
హైదరాబాద్: Munugode అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS Praveen తెలిపారు.గురువారం నాడు న్యూఢిల్లీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. BSP సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో Komatireddy Rajagopal Reddy కి ప్రజలు బుద్ది చెబుతారని చెప్పారు.ఈ ఉప ఎన్నికతో పాటు Telangana రాష్ట్రంలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.ప్రజల సమస్యలు ఎజెండాగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. సామాజిక న్యాయ సాధనే తమ పార్టీ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా TRS ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ఆయన ఆరోపించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో టీఆర్ఎస్, BJP లు ఒకే తరహా విధానాన్ని అవలంభిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు కోరుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కారమౌతాయన్నారు.
మునుగోడు MLA పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీకి పంపారు. ఈ నెల 8వ తేదీన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచాారం శ్రీనివాస్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందించే అవకాశం ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీమానాను ఆమోదిస్తే ఆరు మాసాల్లోపుగా ఎన్నికలు జరగాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సన్నద్దమౌతున్నాయి. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేయనుందని ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు.