హైదరాబాద్ లోని బండ్లగూడలో కెమికల్ బ్లాస్ట్ (chemical blast in hyderabad bandlaguda) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్టుగా సమాచారం. కెమికల్ డబ్బా తెరవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

chemical blast : హైదరాబాద్ లో ఒక్క సారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. బండ్లగూడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తుల మరణం..

బండ్లగూడ ప్రాంతంలో ఆదివారం ఓ వ్యక్తి చెత్త సేకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అతడికి ఓ కెమికల్ డబ్బా దొరికింది. చెత్త సేకరిస్తున్న సమయంలో ఆ డబ్బాలో ఏముందని ఓ నిర్మాణంలో ఉన్న భవనం ముందు దానిని తెరిచాడు. దీంతో ఒక్క సారిగా ఆ కెమికల్ డబ్బా పేలింది. ఈ పేలుడు దాటికి ఘటనా స్థలానికి దగ్గరగా ఉన్న ఓ బిల్డింగ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి.

మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..

దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.