Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్‌ అధిష్టానంపై గత కొంతకాలం నుంచి గుర్రుగా వున్నారు పొంగులేటి. 
 

ex mp ponguleti srinivasa reddy meets ysrtp president ys sharmila
Author
First Published Jan 24, 2023, 7:36 PM IST

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా వున్న పొంగులేటి.. షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

ALso REad: కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దారెటు..?

ఇదిలావుండగా.. బీఆర్ఎస్‌ అధిష్టానంపై గత కొంతకాలం నుంచి గుర్రుగా వున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటికే ఆయన తన అనుచరులు, మద్ధతుదారులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి బీఆర్ఎస్‌లో కొనసాగే అవకాశం లేదని.. ఏ పార్టీలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే దానిపై శ్రీనివాస్ రెడ్డి సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 

బీజేపీలో చేరతారని ప్రచారం..

బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకుని పరోక్ష విమర్శలు చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. పొంగులేటిని పార్టీలో చేర్చుకుని ఖమ్మంలో బలపడాలని కాషాయ పార్టీ భావిస్తుందని, ఇందుకు తెరవెనక మంతనాలు కూడా జరుగుతున్నాయని ప్రచారం కూడా ఉంది. పొంగులేటి కూడా అమిత్ షాను కలవనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. ఈ వార్తలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బహిరంగంగా స్పందించడం లేదు. దీంతో బీజేపీపై ఆయన వైఖరి ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. 

కాంగ్రెస్ నుంచి ఆహ్వానం.. 

మరోవైపు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానాలు వెళ్తున్నాయి. ఇటీవల సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలని కోరారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించగల సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. అలాగే  ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు స్థానిక కాంగ్రెస్‌ నేతలు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలోకి రావాలని ఆశిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios