థ్యాంక్యూ వారియర్స్‌లో భాగంగా కరోనా నుంచి కోలుకున్న గొల్లపల్లి ఎస్ఐ జీవన్‌తో టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ మహిళా ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు

థ్యాంక్యూ వారియర్స్‌లో భాగంగా కరోనా నుంచి కోలుకున్న గొల్లపల్లి ఎస్ఐ జీవన్‌తో టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ మహిళా ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనాపై పోరులో భాగంగా పోలీసుల సేవలు అమోఘమని ఆమె ప్రశంసించారు.

అయితే జీవన్‌కు కరోనా సోకిందన్న దానిపై ఇంకా మిస్టరీ వీడటం లేదు. ఆయన డ్రైవర్ 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని అప్పాకు వెళ్లి కొద్దిరోజుల పాటు శిక్షణ తీసుకుని వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

Also Read:ఆక్సిజన్ లేక కరోనా రోగులు మరణిస్తున్నారు: సీఎస్ తో తెలంగాణ హైకోర్టు

అప్పాలో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల నిర్థారణ అయ్యింది. వారి ద్వారానే ఎస్ఐ డ్రైవర్‌కు కరోనా సోకి ఉంటుందని, డ్రైవర్ నుంచి జీవన్‌కు వైరస్ సోకి వుంటుందని భావిస్తున్నారు.

ఎస్ఐకి కరోనా రావడంతో అక్కడ పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది దాదాపు 15 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ ఆదేశించారు. అంతకుముందు నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానాలో సేవలందిస్తున్న నర్స్‌తో కవిత జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు.

Also Read:తెలంగాణలో కరోనా విజృంభణ: ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కేసులు

ఈ సందర్భంగా కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ కోవిడ్ రోగులకు అందిస్తున్న సేవలను కవిత ప్రశంసించారు.