Asianet News TeluguAsianet News Telugu

ఆక్సిజన్ లేక కరోనా రోగులు మరణిస్తున్నారు: సీఎస్ తో తెలంగాణ హైకోర్టు


 ఆక్సిజన్ సౌకర్యం లేక పలు ఆసుపత్రుల్లో కరోనా రోగులు మరణించారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా టెస్టుల విషయమై తెలంగాణ హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ గురువారం నాడు హాజరయ్యారు.

 

Is rapid antigen testing accurate asks telangana high court
Author
Hyderabad, First Published Aug 13, 2020, 2:40 PM IST


హైదరాబాద్: ఆక్సిజన్ సౌకర్యం లేక పలు ఆసుపత్రుల్లో కరోనా రోగులు మరణించారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా టెస్టుల విషయమై తెలంగాణ హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ గురువారం నాడు హాజరయ్యారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమేష్ కుమార్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. చాలా చోట్ల ఆక్సిజన్, బెడ్స్ లేక  కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకు వచ్చింది.

also read:టెస్టులను పెంచాం: హైకోర్టుకు తెలిపిన తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్

ఆసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట, వరంగల్ సెంటర్లలో ఆక్సిజన్ , బెడ్స్ లేక చాలా మంది చనిపోతున్నారని హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. 

ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ఎంతవరకు సక్సెస్ అయ్యాయో చెప్పలేదని హైకోర్టు ప్రశ్నించింది. యాంటీజేస్ టెస్టుల రిపోర్టు కేవలం 40 శాతం మాత్రమే వస్తోందన్న హైకోర్టు అభిప్రాయపడింది.

మీడియా బులెటిన్ ప్రసారంపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది. హితం యాప్ ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించారని సీఎస్ ను ప్రశ్నించింది ఉన్నత న్యాయ స్థానం.మారుమూల గ్రామల్లో ప్రజలకు హితం యాప్ అంటే ఏమిటో కూడ తెలియదన్న హైకోర్టు అభిప్రాయపడింది.


హైదరాబాద్: 

Follow Us:
Download App:
  • android
  • ios