బీజేపీలో చేరడం మీద ఈటల క్లారిటీ.. రాజీనామా చేసినాకే... !

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. మద్దతు కోరేందుకే బీజేపీ నేతల్ని కలిశానన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. 

telangana ex minister etela clarification on joining in bjp - bsb

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. మద్దతు కోరేందుకే బీజేపీ నేతల్ని కలిశానన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. 

త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. స్వతంత్రంగానే ఉంటానని ఎవరితో కలవబోనని ఈటల అన్నారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, దానికి జెండా, ఎజెండా కూడా ఖరారయ్యాయని సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. 

ఆయన బీజేపీలో చేరుతున్నారని, సోమ, మంగళవారాల్లో జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనమని చెబుతున్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. 

అదే రాత్రి ఈటల రాజేందర్ మాజీ ఎంపీ వివేక్ ఫాంహౌస్ లో కిషన్ రెడ్డితో కలిసి మాట్లాడారని చెబుతున్నారు. మంగళవారం ఆయన కిషన్ రెడ్డితో కలిసి మాట్లాడారని కూడా ప్రచారం జరుగుతోంది. సోమ, మంగళవారాల్లో ఏ రోజు ఈటల, కిషన్ రెడ్డిని కలిశారో తెలియదు కానీ.. ఈ ఇద్దరు మాత్రం భేటీ అయ్యారని ఇరువర్గాల నేతలు ధృవీకరిస్తున్నారు. 

అయితే, గత రెండు రోజుల నుంచి మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ గూటికి చేరతారా..? లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? ఇవి రెండూ కాకుండా కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా? అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఆయనతో చర్చించడం, తాజాగా బీజేపీ జాతీయ నేతే హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరపడంతో మరోసారి ఈటెల రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. 

బీజేపీ వైపు నేతల చూపు: ఈటల సహా ఆ నేతలంతా కమలం గూటికి?..

ఈటల రాజేందర్ తో బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ చర్చలు జరిపారు. సుమారు రెండు గంటలపాటు ఈటెలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫాం హౌస్ లో జరిగిన ఓ సమావేశంలో ఈటెలతో కలిసి బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇదే సమావేశంలో భూపేందర్ యాదవ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ను పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. అయితేబిజెపిలో చేరే అంశంపై ఈటెల రాజేందర్ స్పష్టత ఇవ్వలేదు. పార్టీలోకి వస్తే కీలక పదవి ఇస్తామని కూడా చెప్పినట్లు తెలియవచ్చింది. ఈ ఆహ్వానంపై ఇంతవరకు ఈటెలస్పందించలేదు.

ఈటెల రాజేందర్ బీజేపీలో చేరతారా ? కేంద్ర నేతలతో చర్చలు !!...

మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం పైనే కాకుండా, ముఖ్యమంత్రి కెసిఆర్ పైన ఎదురుదాడికి దిగిన క్రమంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం తనకు లేదని సమాచారం. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల  కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. 

కానీ, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలని ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజురాబాద్ కు ఉప ఎన్నిక తీసుకువచ్చి, అక్కడ గెలిచి టిఆర్ఎస్ కు సవాల్ విసరాలని, ఆపై కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలని ఉద్దేశంగా చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios