ఈఎస్ఐ స్కాంలో దేవికారాణి లీలలు అన్నీఇన్నీ కావు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేషీ నుంచే మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్లుగా ఏసీబీ విచారణలో తేలింది. ఓమ్నీ మెడి ఫార్మా కోసం సిబ్బందిని సైతం దేవికారాణి బెదిరించినట్లుగా తెలుస్తోంది.

286 ఆర్డర్లను తారుమారు చేసి డిస్పాన్సరీ నుంచి వచ్చిన ఆదేశాలను సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్. డిస్పెన్సరీ ఆర్డర్స్‌ను తనకు నచ్చిన రీతిలో పెట్టారు. వీటిలో 26 ఆదేశాలను పూర్తిగా మార్చేశారు దేవికా రాణి సిబ్బంది.

ఒకదశలో ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. శివ, ప్రవల్లిక, రాధిక అనే ఫార్మాసిస్ట్‌ల తెల్ల కాగితాలపై అధికారుల సంతకాలు తెప్పించుకుని తమకు నచ్చినట్లుగా వ్యవహరించినట్లుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు:

వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు

ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)

ఈఎస్ఐ మందుల స్కాం... దేవికా రాణి అరెస్ట్

అవసరం లేకపోయినా మందుల కొనుగోళ్లు: టీఎస్ ఈఎస్ఐలో రూ.300 కోట్ల స్కాం

ఈఎస్ఐ స్కాం: దేవికా రాణితో పాటు ఏడుగురికి రిమాండ్