Asianet News TeluguAsianet News Telugu

వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మందుల కోనుగోలు కేసులో అరెస్టైన  దేవికారాణితో పాటు ఏడుగురిని ఏసీబీ అధికారులు ఉస్మానియాకు తరలించారు.

devika rani and others shifted to osmania hospital for health check up
Author
Hyderabad, First Published Sep 27, 2019, 1:51 PM IST

హైదరాబాద్:ఈఎస్ఐ  ఆసుపత్రులకు మందుల కొనుగోలులో అవకతవకలకు సంబంధించిన అరెస్టు చేసిన ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురిని శుక్రవారం నాడు మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి  తరలించారు.  వైద్య పరీక్షల తర్వాత  తిరిగి  వారిని ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నారు.

శుక్రవారం నాడు ఉదయం దేవికారాణితో పాటు  మరో ఏడుగురు ఉద్యోగులను ఏసీబీ అధికారులు విచారించారు.దేవీకారాణి కార్యాలయంలో 24 గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకొన్నారు.

వైద్య పరీక్షల నిమిత్తం దేవికారాణితో పాటు మరో ఏడుగురిని ఉస్మానియా ఆసుపత్రికి శుక్రవారం నాడు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత తిరిగి ఏసీబీ  కార్యాలయంలో విచారణ జరపనున్నారు.  శుక్రవారం సాయంత్రానికి నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంబంధిత వార్తలు

ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)

ఈఎస్ఐ మందుల స్కాం... దేవికా రాణి అరెస్ట్

 

 

Follow Us:
Download App:
  • android
  • ios