హైద్రాబాద్  లో  సాహితి  ఇన్ ఫ్రా  సంస్థలో  ఈడీ  అధికారులు  సోదాలు  నిర్వహించారు. నగరంలోని  పలు  చోట్ల  ఈడీ  అధికారులు  సోదాలు  చేస్తున్నారు.


హైదరాబాద్: నగరంలోని సాహితి ఇన్‌ఫ్రా సంస్థలో సోమవారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహితి ఇన్‌ఫ్రా సంస్థ డైరెక్టర్ పూర్ణారావు ఇంటితో పాటు ఆ సంస్థ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాహితి ఇన్ ఫ్రా డైరెక్టర్ పూర్ణారావు మరికొన్ని సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

 గతంలో కూడ హైద్రాబాద్ నగరంలో ని రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఈడీ , ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28న నగరంలోని గూగీ పౌండేషన్ , గూగీ గ్లోబల్ ప్రాజెక్టు లిమిటెడ్ , వండర్ సిటీ, రాయల్ సిటీ, వంటి సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తప్పుడు లెక్కలతో ఐటీ రిటర్న్స్ ను సమర్పించారని రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురి రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు ఈ ఏడాది జనవరి 16న సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ లోని ఆదిత్య, సీఎస్‌కే డెవలపర్స్ సంస్థకు చెందిన పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు.