సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ జగ్గారెడ్డి ప్రచారం చేసుకున్నాడంటూ టీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు నియోజకవర్గ ఎన్నికల అధికారి జగ్గారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై 24 గంటల్లోగా స్పందించాలని నోటీసులో పేర్కొన్నారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ జగ్గారెడ్డి ప్రచారం చేసుకున్నాడంటూ టీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు నియోజకవర్గ ఎన్నికల అధికారి జగ్గారెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై 24 గంటల్లోగా స్పందించాలని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెల 17వ తేదీన సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని అమల్లో ఉన్న విషయాన్ని మరిచి ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆయన ప్రచారం సాగిందని పేర్కొన్నారు. సంగారెడ్డి ఓటర్లకు పలు వాగ్దానాలిచ్చి మభ్యపెట్టడానికి జగ్గారెడ్డి ప్రయత్నించాడని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. దీంతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీను జగ్గారెడ్డికి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని...ఈ సమాధానాన్ని బట్టే ఎలక్షన్ కమీషన్ సిబంధనలకు తగ్గట్లు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.
సంగారెడ్డిలో జరిగిన ప్రచార సభలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మంత్రి హరీష్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ లను జగ్గారెడ్డి పరుష పదజాలంతో దూషించాడు. నియోజకవర్గంలోని ప్రజలకు ఐఐటీ సమీపంలో 40 వేల ఇళ్ల పట్టాలు ఇస్తానని... కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తానని
జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీలను ప్రత్యేకంగా పేర్కొంటూ టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి జగ్గారెడ్డి చిక్కుల్లో పడ్డారు.
ఇప్పటికే జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణా కేసులో జైలుకు వెళ్లాడు. కొన్ని రోజుల క్రితమే జైలు నుండి బెయిల్ పై బైటికివచ్చాడు. ఈ క్రమంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం...అదికాస్తా వివాదానికి దారితీయడం నియోజకవర్గంలో చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో ఈసి నిర్ణయంపై ఇరు పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత వార్తలు
కేసీఆర్,కేటీఆర్, హరీష్‌లపై జగ్గారెడ్డి తిట్ల దండకం....
